Begin typing your search above and press return to search.

దంచి కొట్టే వారికి దడ పుట్టించిన టీమిండియా

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా దూసుకెళుతోంది. వేదిక ఏదైనా.. ప్రత్యర్థి జట్టు ఏదైనా గెలుపే మంత్రంగా జట్టు వరుస పెట్టి విజయాల్ని సాధిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:37 AM GMT
దంచి కొట్టే వారికి దడ పుట్టించిన టీమిండియా
X

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా దూసుకెళుతోంది. వేదిక ఏదైనా.. ప్రత్యర్థి జట్టు ఏదైనా గెలుపే మంత్రంగా జట్టు వరుస పెట్టి విజయాల్ని సాధిస్తోంది. అలుపు లేకుండా అప్రతిహతంగా సాగుతున్న అధిపత్యం మరోసారి రుజువైంది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టుకు అవమానకరమైన ఓటమి ఎదురైంది. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత అత్యల్ప స్కోర్ కు ఆ జట్టు ఆలౌట్ కావటంతో భారత్ కు ఘన విజయం సొంతమైంది.

ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టు సౌతాఫ్రికా. ఈ టోర్నీలో ఆ జట్టు నాలుగు మ్యాచ్ ల్లో 350కు పైగా పరుగులు సాధించిన జట్టు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. అలాంటి జట్టును కేవలం 83 పరుగులకే మట్టి కరిపించటం ద్వారా టీమిండియా తన విశ్వరూపాన్ని చూపింది. తాజాగా రోహిత్ సేన ప్రదర్శించిన అత్యద్భుత ఆటకు మిగిలిన జట్లు హడలిపోయేలా చేసింది.

సౌతాఫ్రికా జట్టు ప్రత్యేకత ఏమంటే.. ప్రపంచక్ప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. అలాంటి జట్టును కేవలం 83 పరుగులకే ఆలౌట్ చేసిన ఘనత టీమిండియాకు దక్కింది. ఈ టోర్నీలో భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే.. ప్రత్యర్థికి దిమ్మ తిరిగే స్కోర్ ను ముందు ఉంచటం.. వారిని లక్ష్యానికి చేరకుండా నియంత్రించటం తెలిసిందే. ఆదివారం జరిగిన మ్యాచ్ లోనూ అదే మేజిక్ రిపీట్ అయ్యింది.

భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లకు నిద్ర లేని రాత్రిని మిగిల్చారు భారత్ బౌలర్లు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. బౌలర్లకు స్వర్గధామంగా ఉండే పిచ్ మీద ఈసారి ప్రపంచకప్ టోర్నీలో ఈడెన్ గార్డెన్ లో జరిగిన రెండు మ్యాచ్ లలో నమోదైన పరుగులు కేవలం 142, 204 మాత్రమే. అలాంటి పిచ్ మీద తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 326 పరుగులు అంటేనే.. మన బ్యాట్స్ మెన్లు ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థమవుతుంది. మొదటి 5 ఓవర్లు పూర్తి అయ్యేసరికే టీమిండియా స్కోర్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులంటేనే ఎంత దూకుడుగా ఆడారో అర్థమవుతుంది.

13.1 ఓవర్లకు 100 పరుగులకు చేరిన టీమిండియా స్కోర్.. 26 ఓవర్లకు కానీ 150 పరుగులమార్కును అందుకోలేదు. కతొలుత దూకుడుగా ఆడిన కోహ్లీ తర్వాత నెమ్మదిగా ఆడాడు. 49వ ఓవర్లో సింగిల్ తో రికార్డు సెంచరీని (49వ సెంచరీ) సాధించటంతో ఈడెన్ గార్డెన్ మొత్తం అభిమానుల సంబరాలతో హోరెత్తింది. చివరి ఓవర్లలో జడేజా 6, 4, 4 బాదటంతో స్కోర్ 320పరుగుల దాటింది.దక్షిణా ఫ్రికా బ్యాట్స్ మెన్లను 83 పరుగులకు కట్టడి చేయటంతో.. దారుణ పరాజయాన్ని ఆ జట్టుకు ఎదురైంది. ప్రపంచకప్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోర్ కు ఓడిపోవటం ఇదే.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వన్డే క్రికెట్ లో తన ప్రత్యర్థిని వంద కంటే తక్కువ పరుగులకే కట్టడి చేసిన సందర్భాలు నాలుగు. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధికసార్లు ఈ ఘనతను సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. పరుగుల పరంగా 243 పరుగుల భారీ స్కోర్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించటం ఇదే తొలిసారి. 2023లో 200 పరుగులకు పైగా తేడాతో భారత్ గెలిచిన వన్డేలు 5 కాగా.. ఒక క్యాలెండర్ ఏడాదిలో మరే జట్టు ఈ మేజిక్ చేయలేకపోయింది. పుట్టిన రోజునాడు ప్రపంచకప్ లో సెంచరీ సాధించిన మూడో ఆటగాడు కోహ్లీనే. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 8 మ్యాచ్ లకు 8 మ్యాచ్ లు గెలిచింది. నెట్ రెట్ లోనే 2.45లో టాప్ లో నిలిచింది.తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు నిలిచింది. ఈ జట్టు ఇప్పటివరకు8 మ్యాచులు ఆడగా.. ఆరింటిలోనే గెలవగా.. టీమిండియా మాత్రం తాను ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ విజయం సాధించటం గమనార్హం.