100 పైగా తేడాతో గెలిస్తేనే సెమీస్ రేసులో.. టీమ్ఇండియాకు ఫేవర్!
చెన్నైలోని ఎంఎం చిదంబరం స్టేడియం..! స్పిన్ కు పెట్టింది పేరు. అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అయినా, టెస్టు మ్యాచ్ లు అయినా..! ఇక్కడి పిచ్ నెమ్మది.
By: Tupaki Political Desk | 25 Feb 2026 7:00 PM ISTచెన్నైలోని ఎంఎం చిదంబరం స్టేడియం..! స్పిన్ కు పెట్టింది పేరు. అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అయినా, టెస్టు మ్యాచ్ లు అయినా..! ఇక్కడి పిచ్ నెమ్మది. కానీ, గురువారం జింబాబ్వేతో టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా కీలక మ్యాచ్ ఆడబోతోంది. అసలే జింబాబ్వే జోరు మీదుంది. ఆస్ట్రేలియా వంటి జట్టును ఓడించింది. మరోవైపు టీమ్ ఇండియా గురువారం నాటి సూపర్ 8 మ్యాచ్ లో గెలవకుంటే ఇక ఇంటికే అనే పరిస్థితి. అది కూడా మామూలు గెలుపు కాదు..! ఏకంగా వందకు పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్ బలం బాగానే ఉన్న జింబాబ్వేను మట్టికరిపించడం అంటే మాటలు కాదు. అందుకనే పిచ్ చిదంబర రహస్యంలా కాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ఓటమి.. ఈసారి గెలుపు సవాల్
ఆదివారం సూపర్ 8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఏకంగా 76 పరుగుల తేడాతో ఓడిపోవడం రన్ రేట్ పరంగా టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసింది. అందుకని టీమ్ ఇండియాకు జింబాబ్వేతో పాటు వెస్టిండీస్ తో జరగాల్సిన మ్యాచ్ లు చాలా కీలకంగా మారాయి. అందుకనే ముందుగా జింబాబ్వే గండం తప్పేలా స్పిన్ పిచ్ ను బ్యాటింగ్ కు అనుకూలంగా మార్చేలా చూస్తున్నారు.
వెస్టిండీస్ లా బాదేస్తేనే..
రెండు రోజుల కిందట సూపర్ 8 మ్యాచ్ లో జింబాబ్వేపై వెస్టిండీస్ 254 పరుగుల భారీ స్కోరు చేసింది. జింబాబ్వేపై పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం అనుకూలించినా టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ కూడా ఇలానే చెలరేగే చాన్సుంది. అందుకనే చిదంబరం స్టేడియంలో దేశవాళీ మ్యాచ్ లకు వాడని పిచ్ ను జింబాబ్వే తో మ్యాచ్ కు ఉపయోగించనున్నట్లు సమాచారం. బంతి బ్యాట్ మీదకు వస్తే.. టీమ్ఇండియా హిట్టర్లు మిగతా పనిచూసుకుంటారు. తర్వాత బౌలర్లు ఎలాగూ చెలరేగుతారు. అప్పుడు 100కు పైగా పరుగుల తేడాతో గెలవడం చాలా సులువే.
అయినా సరిపోదు..
టీమ్ఇండియా మొదట జింబాబ్వేపై, అనంతరం వెస్టిండీస్ పై గెలిస్తే సరిపోదు. అటువైపు దక్షిణాఫ్రికా కూడా రెండు మ్యాచ్ లలోనూ గెలవాలి. అప్పుడు మన జట్టు నేరుగా సెమీస్ కు వెళ్తుంది. వెస్టిండీస్ మీద దక్షిణాఫ్రికా ఓడితే మనకు ఇబ్బందే. జింబాబ్వే ముందుగానే రేసు నుంచి ఔట్ అవుట్ అయితే.. ఈ మూడు జట్లు నాలుగేసి పాయింట్లతో ఉంటాయి. దక్షిణాఫ్రికా గనుక తడబడి వెస్టిండీస్, జింబాబ్వే చేతిలో ఓడితే.. భారత్-వెస్టిండీస్ సెమీస్ కు వెళ్తాయి. మన జట్టు జింబాబ్వేపై ఓడి విండీస్ పై గెలిస్తే ఈ మూడు జట్లు 2 పాయింట్లతో ఉండి, దక్షిణాఫ్రికాను సెమీస్ కు (పరోక్షంగా) పంపిస్తాయి. నెట్ రన్ రేట్ ప్రకారం వీటిలో 2 జట్లు సెమీస్ చేరతాయి
