ఎలుక తోలు.. కుక్క తోక..! చావుదెబ్బ తిన్నా పాక్ నీచ బుద్ధి మారవంతే
ఆదివారం మ్యాచ్ లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్ తోనే కాదు మాటతోనూ దూకుడు చూపాడని తెలుస్తోంది.
By: Tupaki Desk | 22 Sept 2025 3:59 PM ISTయుద్ధంలోనే కాదు మైదానంలోనూ భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా పాకిస్థాన్ నీచ బుద్ధి ఎప్పటికీ మారదు..! పరాజయాలు పరాభవాలు దానికి మామూలే...! తాజాగా ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లోనూ ఇదే పాకిస్థాన్ ను చిత్తుచేసింది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న పలు పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం నాటి సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెటర్ల అతి ఎక్కువైంది. దీనికి టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా అంతే దీటుగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇదంతా ఇప్పటికే సంచలనంగా మారింది.. మున్ముందు మరెక్కడ దారితీస్తుందో చూడాలి...! ఈ పరిణామాలు ఒక్కోటిగా చూద్దాం...!
ఆఫ్రిదిని బోస్డికే అన్నాడా...?
ఆదివారం మ్యాచ్ లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్ తోనే కాదు మాటతోనూ దూకుడు చూపాడని తెలుస్తోంది. పాక్ ప్రధాన పేస్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది బౌలింగ్ లో తొలి బంతికే సిక్స్ కొట్టిన తర్వాత ఈ ఘటన జరిగింది. అక్కసు ఆపుకోలేకపోయిన ఆఫ్రిది రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అభిషేక్.. చల్ బోస్ డికే అని అన్నట్లు వీడియో ట్రెండింగ్ అవుతోంది. దీని తర్వాత మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ ఫోర్ కొట్టాక కూడా ఆఫ్రిదిని ఇదే విధంగా ట్రీట్ చేసినట్లు తెలుస్తోంది.
హారిస్ రవూఫ్ వెకిలికి బుద్ధొచ్చేలా...
పాక్ పేస్ బౌలర్ హారిస్ రవూఫ్ ఈ మ్యాచ్ సందర్భంగా తనను విమానం కూలిపోతున్నట్లుగా సైగలు చేశాడు. అంటే.. ఆపరేషన్ సిందూర్ లో భారత రఫేల్ జెట్లను పాక్ సైన్యం కూల్చివేసిందనే అర్థం వచ్చేలా ఈ సైగలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓ సందర్భంలో గిల్-రవూఫ్ ముఖాముఖి తలపడేలా వచ్చారు. దీంతో అంపైర్లు కలగజేసుకున్నారు.
అతడు గన్ ఎందుకు పేల్చాడు..?
పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్ జాద ఫర్హాన్ కొత్త ఆటగాడు.. అతడు కూడా హాఫ్ సెంచరీ తర్వాత గన్ పేలుస్టున్నట్లు సైగలు చేశాడు. ఈ గన్ ఫైర్... పెహల్గాం ఉగ్రదాడిని సూచిస్తున్నట్లుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. పెహల్గాం ఘటనతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందనే విషయాన్ని గుర్తించకుండా ఇలా ప్రవర్తించడం ఏమిటంటూ పాక్ ఆటగాళ్లను తప్పుబడుతున్నారు.
పాక్ అసలు మాకు పోటీనే కాదు..
ఇక టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ పాకిస్థాన్ గాలి తీసేశాడు. అసలు పాకిస్థాన్ తమకు పోటీనే కాదన్నాడు. 15-20 మ్యాచ్ లు ఆడాక ఫలితం సరిసమానంగా ఉంటే... అప్పుడు పోటీ అంటారన్నాడు. 10-1, 13-0 ఫలితాన్ని చూశాక
పోటీ ఎలా అంటారని ప్రశ్నించాడు. గత ఆరు మ్యాచ్ లలో పాక్ ఒక్కటి కూడా గెలవని సంగతి గుర్తుచేశాడు.
షేక్ హాండ్ పై గంభీరమైన కౌంటర్..
అసలు పాకిస్థాన్ అంటే సై అంటూ వచ్చే కనిపించే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే మరింత పంచ్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిశాక అంపైర్లతోనే కరచాలనం చేయాలని.. పాక్ ఆటగాళ్లతో కాదన్నట్లు అతడు ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేశాడు.
