ఒక్క నిర్ణయం ఖరీదు వందకోట్లు.. ఖాళీ జెర్సీతో టీమ్ ఇండియా
మరొక్క మూడు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. టి20 ఫార్మాట్ లో జరిగే ఈ కప్ లో టీమ్ ఇండియానే ఫేవరెట్.
By: Tupaki Desk | 6 Sept 2025 9:00 PM ISTమరొక్క మూడు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. టి20 ఫార్మాట్ లో జరిగే ఈ కప్ లో టీమ్ ఇండియానే ఫేవరెట్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు ఇప్పటికే ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. సూర్య, హైదరాబాదీ తిలక్ వర్మ, వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తదితరులు ప్రాక్టీస్ లో తలమునకలైన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులోనే ఒక విషయం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అది టీమ్ ఇండియా జెర్సీలను చూస్తే తెలుస్తోంది.
ఆన్ లైన్ గేమింగ్ బ్యాన్ దెబ్బతో
మొన్నటివరకు టీమ్ ఇండియా స్పాన్సర్ గా ఉన్నది డ్రీమ్ 11 సంస్థ. మూడేళ్లకు రూ.350 కోట్లకు పైగా కాంట్రాక్టు దానిది. ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ నుంచి స్పాన్సర్ షిప్ తీసుకుంది. మరో ఏడాది పైనే దీనికి కాంట్రాక్టు ఉంది. అంటే, రూ.100 కోట్లు విలువ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆన్ లైన్ గేమింగ్ బిల్లు కారణంగా డ్రీమ్ 11 తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆసియా కప్ లో స్పాన్సర్ పేరున్న జెర్సీ లేకుండానే టీమ్ ఇండియా బరిలో దిగుతోంది. కొత్త స్పాన్సర్ ను వెదికే సమయం కూడా లేకపోవడంతో.. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుకు చెందిన జట్టుకు విచిత్ర పరిస్థితి ఎదురైంది.
కొత్త స్పాన్సర్ షిప్ రూ.400 కోట్ల పైనే...
ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రూంలో ఏటా రూ.వేల కోట్లు సంపాదిస్తోంది బీసీసీఐ. టీమ్ఇం డియా స్పాన్సర్ షిప్ దీంతో పోలిస్తే పదో వంతు కూడా ఉండదు. డ్రీమ్ 11 వైదొలగిన నేపథ్యంలో కొత్త స్పాన్సర్ రేట్లను బీసీసీఐ భారీగా పెంచేస్తోందట. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ కు అయితే రూ.3.5 కోట్లు, టోర్నీల్లో అయితే రూ.1.5 కోట్లుగా నిర్దయించినట్లు కథనాలు వస్తున్నాయి.
మూడేళ్లకు రూ.400 కోట్లకు పైనే...
కొత్త జెర్సీ కాంట్రాక్టుతో మూడేళ్లలో బీసీసీఐకి రూ.400 కోట్ల ఆదాయం రానుందని భావిస్తున్నారు. డ్రీమ్ 11 ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ కు రూ.3.17 కోట్లు, టోర్నీలకు రూ.1.12 కోట్లు చెల్లించింది. దీనిపై 10 శాతం, 3 శాతం పెంపుతో కొత్త స్పాన్సర్ షిప్ ధర నిర్ణయించింది. వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్ భారత్ లోనే జరగనుంది. ఆపై ఏడాది వన్డే ప్రపంచ కప్ ఉంది. మూడేళ్లలో 130 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందుకనే స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐ భారీ ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది.
