Begin typing your search above and press return to search.

టెస్టుల్లోనూ స్టాప్‌ క్లాక్‌.. సంప్రదాయ ఫార్మాట్‌లో 5 కొత్త రూల్స్‌

ఈ సందర్భంగా ప్రకటించినా.. కొత్త రూల్స్ మూడు ఫార్మాట్ లకూ వర్తిస్తాయి.

By:  Tupaki Desk   |   27 Jun 2025 10:00 AM IST
టెస్టుల్లోనూ స్టాప్‌ క్లాక్‌.. సంప్రదాయ ఫార్మాట్‌లో 5 కొత్త రూల్స్‌
X

వన్డేలు వచ్చాక టెస్టుల పని అయిపోయిందన్నారు.. టి20లు వచ్చాక టెస్టులు ఎవరూ చూడరని అకున్నారు.. విచిత్రం ఏమంటే.. ఈ మూడు ఫార్మాట్లలో మధ్యలో వచ్చిన వన్డేలు కనుమరుగు అవుతున్నాయి కానీ.. టెస్టులు మరింత జనరంజకంగా మారుతున్నాయి. కొన్నేళ్ల కిందట వరకు టెస్టులు ఫలితాలు రాక బోర్‌ కొట్టించిన మాట వాస్తవం. కానీ, అది ఒక సంధి దశ. ఆ తర్వాత టెస్టుల కథ మారింది. మరీ ముఖ్యంగా ఇంగ్లండ్‌ బజ్‌ బాల్‌ ఆటతో టెస్టులు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మరో ఐదు కొత్త నిబంధనలు తెచ్చింది. ఇటీవలే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌పై గందరగోళం తొలగించింది. వన్డేల్లో కొత్త బంతిపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు టెస్టుల్లో స్టాప్‌ క్లాక్‌, డీఆర్ఎస్ పై మార్పులతో కీలకమైన కొత్త రూల్స్ ప్రకటించింది. అయితే, ఇప్పుడు అన్నీ టెస్టులే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రకటించినా.. కొత్త రూల్స్ మూడు ఫార్మాట్ లకూ వర్తిస్తాయి.

కొత్త రూల్స్‌లో స్టాప్‌ క్లాక్‌ ముఖ్యమైనది. ఇప్పటివరకు వన్డే, టి20లలో మాత్రమే ఇది ఉంది. ఇప్పుడు టెస్టుల్లోనూ చేర్చింది. దీనికి కారణం.. స్లో ఓవర్ రేట్‌ సమస్యను పరిష్కరించడమే. ఫీల్డింగ్ జట్టు మునుపటి ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపు కొత్త ఓవర్‌ ప్రారంభించాలి. ఆలస్యం జరిగితే అంపైర్లు వార్నింగ్ ఇస్తారు. రెండుసార్ల కంటే ఎక్కువ వార్నింగ్ ఇస్తే.. బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు ఇస్తారు. ప్రతి 80 ఓవర్లకు గడియారం రీ-సెట్ అవుతుంది. కొత్త రూల్‌ను ప్రస్తుత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌లోనే అమల్లోకి తెస్తారు.

ఉమ్ము బలవంతంగా రాయొద్దు..

బంతిపై ఉమ్ము (సలైవా) రుద్దడంపై నిషేధం ఇప్పటికే తొలగించగా.. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకొని ఫీల్డింగ్‌ జట్టు బంతి స్వరూపాన్ని మారుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. తద్వారా కొత్త బంతిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణ. అందుకనే ఇకపై అలా జరగడానికి వీల్లేకుండా.. అంపైర్లు బంతిని పరిస్థితిని గమనిస్తారు. షేప్‌ గణనీయంగా మారిందని భావిస్తేనే బంతిని మారుస్తారు. ఉమ్మును బలవంతంగా బంతిపై రుద్దడానికి వీల్లేదు. కావాలని అలా చేస్తే బ్యాటింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు.

-డీఆర్‌ఎస్‌లో కొత్త రూల్‌ ఎలా అమలు చేస్తారో చూద్దాం.. ఫీల్డింగ్ జట్టు క్యాచ్ కు అప్పీల్ చేస్తే, అంపైర్ ఔటిస్తే బ్యాటింగ్ జట్టు రివ్యూ కోరుతుంది. అప్పుడు థర్డ్ అంపైర్ తొలుత అల్ట్రాఎడ్జ్ చెక్ చేస్తారు. బంతి బ్యాట్ కు తగలేకపోతే ఎల్బీడబ్ల్యూ చూస్తారు. ఔట్ అని తేలినా లేకపోతే అంపైర్స్ కాల్ వచ్చినా ఔట్ గానే పరిగణిస్తారు.

-కొత్త రూల్ ప్రకారం నో బాల్ కు క్యాచ్ పడితే నాటౌట్. కానీ, క్యాచ్ పట్టినప్పుడు అది క్లీన్ గా ఉందా? కాదా అని చూస్తారు. క్లీన్ క్యాచ్ అయితే పిచ్‌ తిరిగిన పరుగులు జత చేయరు. నో-బాల్ పరుగు మాత్రమే ఇస్తారు. క్లీన్ క్యాచ్ కాకపోతే బ్యాటర్లు పూర్తి చేసిన పరుగులను జట్టు స్కోర్ లో జత చేస్తారు. క్యాచ్ సరిగా పట్టకుండా అప్పీల్ చేస్తే.. థర్డ్ అంపైర్ చెకింగ్‌ లో క్లీన్ క్యాచ్ కాదని నాటౌట్ గా తెలితే నో బాల్ గా ప్రకటిస్తారు.

-బ్యాటర్లు కొన్ని సందర్భాల్లో బ్యాట్ ను పూర్తిగా క్రీజ్ లో పెట్టరు. ఇది షార్ట్ రన్. దీనికి గతంలో రన్ ఉండదని చెప్పి అంపైర్లు బ్యాటర్లకు వార్నింగ్ ఇచ్చేవారు. కొత్త రూల్‌ ప్రకారం బ్యాటర్ పరుగు పూర్తి చేసి ఇంకో పరుగు తీసే క్రమంలో క్రీజ్ లో బ్యాట్ పూర్తిగా పెట్టకుంటే 5 రన్స్ పెనాల్టీ విధిస్తారు. పైగా ఫీల్డింగ్ జట్టు తర్వాత బంతికి ఎవరు స్ట్రయిక్‌ తీసుకోవాలో నిర్దేశించవచ్చు.