Begin typing your search above and press return to search.

గంభీర్ - కొహ్లీ... వీళ్లకి ఆస్కార్ ఇవ్వాలంటున్న గవాస్కార్!

తాజాగా జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ఆలింగనం చేసుకుని, చిరునవ్వులు చిందించుకున్నారు.

By:  Tupaki Desk   |   30 March 2024 3:44 AM GMT
గంభీర్ - కొహ్లీ... వీళ్లకి ఆస్కార్  ఇవ్వాలంటున్న గవాస్కార్!
X

ఐపీఎల్ - 2024 సీజన్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య వార్ వన్ సైడ్ అన్నట్లుగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో బెంగళూరు ను కోల్ కతా చిత్తు చేసింది. బెంగళూరు నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లకే చేధించింది. ఆ సంగతి అలా ఉంటే... ఈ మ్యాచ్ లో కొహ్లీ – గంభీర్ ల మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

అవును... ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గౌతం గంభీర్ – విరాట్ కొహ్లీ మధ్య ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఉపూ, నిప్పులా కనిపించే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, కేకేఆర్ మెంటార్ గౌంతం గంభీర్ లు కలిపోయారు! తాజాగా జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ఆలింగనం చేసుకుని, చిరునవ్వులు చిందించుకున్నారు.

వాస్తవానికి ఆర్సీబీ, కోల్ కతా మ్యాచ్ అనగానే అందరి దృష్టీ కొహ్లీ, గంభీర్ లపై ఉంటుందనడంలో సందేహం లేదు! కెమెరా కళ్లతో పాటు, మైదానంలోని ప్రేక్షకుల కళ్లూ వారిపైకు కేంద్రీకృతమై ఉంటాయి! అయితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ టైం ఔట్ సమయంలో ఈ ఇద్దరూ నవ్వుతూ పలకరించుకున్నారు. మైదానంలోకి వచ్చిన గంభీర్.. కొహ్లీ దగ్గరకు వెళ్లి కరచాలనం చేశాడు. ఈ సమయంలో కొహ్లీ కూడా నవ్వుతూ స్పందిస్తూ గంభీర్ ను హతుకున్నాడు. అనంతరం ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నట్లు కనిపించారు.

దీంతో... ఒక్కసారిగా మైదానం అంతా సైలంట్ గా అయిపోయినంత పనైంది! దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఇదే బెస్ట్ మూమెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరోపక్క... ఈ సందర్భాన్నికి ఫెయిర్ ప్లే అవార్డు దక్కాలని రవిశాస్త్రి వ్యాఖ్యానించగా.. ఫెయిర్ ప్లే కాదు, వీళ్లకు ఆస్కార్ ఇవ్వాలని గవాస్కార్ చమత్కరించాడు.