Begin typing your search above and press return to search.

రెడ్ కార్డు తో అవుట్ అయిన తొలి క్రికెటర్ గా చెత్త రికార్డు

ఈ నిబంధన ప్రవేశపెట్టడమేంటి దానికి బలి అయిన తొలి క్రికెటర్ గా సునీల్ నరైన్ రికార్డు క్రియేట్ చేశారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:57 PM GMT
రెడ్ కార్డు తో అవుట్ అయిన తొలి క్రికెటర్ గా చెత్త రికార్డు
X

రెడ్ కార్డు అన్నది అంతర్జాతీయ క్రికెట్ లో లేదు. సాధారణంగా దాన్ని హాకీ, ఫుట్ బాల్, రగ్బీ వంటి క్రీడలలో మాత్రమే ఉపయోగిస్తారు. ఆటగాళ్ళు ఎవరైన హద్దులు దాటినా లేక కోచ్ లు కూడా విపరీతంగా ప్రవర్తించినా అంపైర్లు ఆ ఆటగాడిని లేదా కోచ్ ని మైదానం వదిలి వెళ్లాలని కోరుతూ రెడ్ కార్డు చూపిసారు. దాంతో వారు ఆటను వదిలేయాల్సిందే. ఇక దీని మీద నిబంధలను గట్టిగానే ఉంటాయి. అది కేవలం ఆ ఆటకా లేక రెండు మూడు మ్యాచ్ లకు బహిష్కరణ అన్నది కూడా నిబంధలన మేరకు చూసి నిర్ణయిస్తారు.

ఇపుడు అదే విధానాన్ని వెస్టిండీస్ లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రవేశపెట్టారు. ఈ నిబంధన ప్రవేశపెట్టడమేంటి దానికి బలి అయిన తొలి క్రికెటర్ గా సునీల్ నరైన్ రికార్డు క్రియేట్ చేశారు. వివరాలోకి వెళ్తే ఆదివారం సెయింట్ కీట్స్ అండ్ నెవిన్ పాట్రియాట్స్ వర్సెస్ ట్రిన్ బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇక ఈ లీగ్ లో ట్రిన్ బగో నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఈ జట్టు 20 ఓవర్లు వేయందుకు రెడ్ కార్డ్ అంపైర్ చూపించడంతో మైదానాన్ని నరైన్ దాటాల్సి వచ్చింది. ఇక సీపీఎల్ లో వచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రకారం చూసుకుంటే 18వ ఓవర్ ని ప్రారంభించకపోతే ఆ ఓవర్ లో ముప్పయి యార్డ్ సర్కిల్ అవతల కేవలం నలుగురు ఫీల్డర్స్ మాత్రమే ఉండాలి.

అలాగే 19వ ఓవర్ ప్రారంభానికి ముందు కూడా ఓవర్ రేట్ తక్కువను లెక్కిస్తారు దాన్ని బట్టి చూస్తే ముగ్గురు ఫీల్డర్స్ మాత్రమే 30వ్ యార్డు సర్కిల్ అవతల ఉండాల్సి వస్తుంది. ఇలా 20వ ఓవర్ వేయనందుకు ఒక జట్టు సభ్యుడిని మైదానం దాటించాలి. అయితే కెప్టెన్ తీసుకున్న నిర్ణయం మేరకు నరైన ఈ రెడ్ కార్డ్ యాక్షన్ కి బలి అయ్యారని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో సెయింట్ కీట్స్ అండ్ నెవిన్ పాట్రియాట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్ ని ట్రిన్ బాగో నైట్ రైడర్స్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి సాధించింది.