Begin typing your search above and press return to search.

అబ్బా అతడికి అంతా తొందరే.. క్రికెట్ లో.. పాలిటిక్స్ లో

దీంతో సచిన్ తెందూల్కర్ తర్వాత భారత క్రికెట్ ఆశాకిరణం అతడేనని దేశమంతా గొప్పగా చెప్పుకొంది.. కానీ,

By:  Tupaki Desk   |   6 Jan 2024 11:30 AM GMT
అబ్బా అతడికి అంతా తొందరే.. క్రికెట్ లో.. పాలిటిక్స్ లో
X

ఓ 22 ఏళ్ల కిందట.. ధోనీ అంటే ఎవరికీ తెలియదు.. కోహ్లి ఇంకా నిక్కర్లు వేసుకుంటున్నాడు.. కానీ, ఓ తెలుగు కుర్రాడు ఇంగ్లండ్ గడ్డపై జూనియర్ క్రికెట్ లో అదరగొట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో చివరి వికెట్ మాత్రమే ఉండగా.. సిక్సర్ కొట్టి మరీ జట్టును గెలిపించాడు.. అప్పటికి అతడి వయసు 16 మాత్రమే. నాడు అతడు చేసిన పరుగులు ఎన్నో తెలుసా? 177. దీంతో సచిన్ తెందూల్కర్ తర్వాత భారత క్రికెట్ ఆశాకిరణం అతడేనని దేశమంతా గొప్పగా చెప్పుకొంది.. కానీ,కట్ చేస్తే..

2023కు వచ్చేసరికి అతడు భారత జట్టుకు ఆడింది 55 వన్డేలు, 6 టి20లు మాత్రమే. దీన్నిబట్టే ఆ క్రికెటర్ జీవితం ఎంతటి ఒడిదొడుకులకు లోనైందో తెలుసుకోవచ్చు. ఇదంతా తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు గురించి. 20 ఏళ్ల కిందటే అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ గా పేరుతెచ్చుకున్న రాయుడు కెరీర్ గొప్పగా సాగలేదు. 2019లో మంచి ఫామ్ లో ఉండగా వన్డే ప్రపంచ కప్ కు ఎంపిక చేయకుండా సెలక్టర్లు ఘోర తప్పిదం చేశారు. కాగా.. 2002-23 మధ్య దేశీయంగానూ క్రికెటర్ గా రాయుడి కెరీర్ అనేక ఇబ్బందుల మధ్య సాగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) రాజకీయాలకు అతడు బలయ్యాడు. ఆంధ్రాకు వెళ్లిపోయాడు. అనంతరం బరోడాకు మారాడు. ఇక జాతీయ జట్టుకు ఎంపికయ్యేది కష్టమే అనుకుంటుండగా.. కాగా, సచిన్ అండతో ముంబై ఇండియన్స్ కు ఆడడం కలిసొచ్చింది. 2013-14 సీజన్ లో వన్డే, టి20 అరంగేట్రం చేశాడు. కాగా.. కెరీర్ 55 అంతర్జాతీయ వన్డేలు ఆడిన రాయుడు 3 సెంచరీల సాయంతో 1694 పరుగులు చేశాడు. సగటు 47.05. ఇక 6 టి20ల్లో 42 పరుగులు చేశాడు. దేశానికి గొప్ప క్రికెటర్ గా ఎదుగుతాడని భావించిన రాయడు.. ఒక్క టెస్టు కూడా ఆడలేకపోవడం గమనార్హం. ఇక 2019 వన్డే ప్రపంచకప్ నకు ఎంపిక కాకపోవడంతో సెలక్షన్ కమిటీని విమర్శించి.. ఆ తర్వాత మొత్తానికే అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు. మధ్యలో ఓ సారి రిటైర్మెంట్ ప్రకటించి వెనక్కు తీసుకున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన రాయుడు ఈ సీజన్ నుంచి లీగ్ క్రికెట్ కూ గుడ్ బై చెప్పాడు. ఈ సందర్భంగానూ అతడి రిటైర్మెంట్ పై కొంత డ్రామా నడిచింది.

రాజకీయాల్లోకి వస్తానంటూ..

2022 మార్చిలోనే తాను రాజకీయాల్లోకి వెళ్తున్నానంటూ రాయుడు హింట్ ఇచ్చాడు. కాగా, రాయుడు స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా. దీంతో అప్పటినుంచి అతడు ఏ పార్టీలో చేరుతాడనేది ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో వైసీపీ సర్కారు చర్యలను, ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనను మెచ్చకుంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాయుడు వైసీపీలో చేరడం ఖాయమని తెలిసిపోయింది. దీనికితగ్గట్లే.. రాయుడుకు పది రోజుల కిందట వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ, ఇంతలోనే రాయుడు తాను రాజకీయాల నుంచి దూరం జరుగుతున్నట్లు ప్రకటించాడు. ఇలా.. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రాకుండానే వెనక్కు వెళ్లిపోయాడు.