Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్ చీటింగ్ ట్రిక్స్.. బీసీసీఐ కర్మ

భారత్ ను దెబ్బకొట్టాలని ఇంగ్లండ్ స్కెచ్ గీసింది. భారత్ ఏ జట్టుకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా కుట్ర చేస్తోంది.

By:  Tupaki Desk   |   8 Jun 2025 9:15 AM IST
ఇంగ్లండ్ చీటింగ్ ట్రిక్స్.. బీసీసీఐ కర్మ
X

భారత్ ను దెబ్బకొట్టాలని ఇంగ్లండ్ స్కెచ్ గీసింది. భారత్ ఏ జట్టుకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా కుట్ర చేస్తోంది. తాజాగా ముందుగానే ఇంగ్లండ్ చేరిన భారత ఏ జట్టుకు చుక్కలు చూపిస్తోంది. ఇండియా ఏ Vs ఇంగ్లాండ్ లయన్స్ టెస్టు సిరీస్‌లో పిచ్‌లపై మోసపూరితంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలతో ఇంగ్లండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు (ECB) దుమారం ఎదుర్కొంటోంది. ఈ సిరీస్‌లో భారత్ ఏ జట్టుకు మృదువైన పిచ్‌లను మాత్రమే ఇచ్చి, అసలైన ఇంగ్లాండ్ స్వింగ్‌ పిచ్ లను ప్రధాన మ్యాచ్‌కు మాత్రమే దాచిపెట్టారన్న విమర్శలు ముదిరాయి.

ఫలితంగా భారత జట్టు పూర్తి స్థాయిలో సవాళ్లేని, ఫ్లాట్ వికెట్లపై ప్రాక్టీస్ చేస్తోంది.. కానీ అసలు మ్యాచ్ రోజు స్వింగ్ ఉన్న పిచ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లు ఒక్కొక్కరినీ వేటాడే అవకాశం ఉందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఇది క్రికెట్‌లో హోం అడ్వాంటేజ్‌ను కేవలం ప్రయోజనంగా కాకుండా, వ్యూహాత్మకంగా మలచుకుంటున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో పలువురు అభిమానులు బీసీసీఐ పై కూడా ఆరోపణలు చేస్తున్నారు. 2024లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను సందర్శించినప్పుడు, అప్పుడూ ఇలానే పిచ్‌లను తనకు అనుకూలంగా మార్చుకుందని పేర్కొంటున్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితి ఆసక్తికరంగా మారుతోంది. ఈ నెల 20న ప్రధాన మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అసలు పిచ్‌లు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ పెరుగుతోంది. బీసీసీఐ గతంలో చేసిందని చెబుతూ, ECB ఇప్పుడు అదే బాటలో నడవడం నిజమేనా? ఇది కర్మా రూపంగా భావించాలా? అన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఏమైనా, అసలు మ్యాచులో భారత ఆటగాళ్లు నిజంగా పిచ్ మార్పులతో ఎదురుదాడికి గురవుతారా లేక తమ బ్యాటింగ్ శైలితో ఆ పిచ్‌లను కూడా ఓడిస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.జూన్ 20న జరగబోయే అసలైన ఫైట్ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది!