Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్‌ Vs అర్జెంటీనా.. స్పెయిన్‌ను ఢీకొట్టేదెవరు? సెమీస్‌పై ప్రపంచం మొత్తం ఆసక్తి

ఫిఫా వరల్డ్‌కప్ 2026 క్లైమాక్స్ వచ్చేసింది బాస్.. ఆల్రెడీ మొదటి సెమీస్‌లో "ఫ్రాన్స్ మళ్లీ కప్పేస్తుందిలే" అని కాలర్ ఎగరేసిన ప్రిడిక్షన్ పండితులందరికీ స్పెయిన్ గట్టి షాకే ఇచ్చింది.

By:  A.N.Kumar   |   15 July 2026 10:30 AM IST
ఇంగ్లండ్‌ Vs అర్జెంటీనా.. స్పెయిన్‌ను ఢీకొట్టేదెవరు? సెమీస్‌పై ప్రపంచం మొత్తం ఆసక్తి
X

ఫిఫా వరల్డ్‌కప్ 2026 క్లైమాక్స్ వచ్చేసింది బాస్.. ఆల్రెడీ మొదటి సెమీస్‌లో "ఫ్రాన్స్ మళ్లీ కప్పేస్తుందిలే" అని కాలర్ ఎగరేసిన ప్రిడిక్షన్ పండితులందరికీ స్పెయిన్ గట్టి షాకే ఇచ్చింది. ఫ్రాన్స్‌ను ఇంటికి పంపించి స్పెయిన్ రాచఠీవితో ఫైనల్‌లో కూర్చుంది. ఇప్పుడు అందరి కళ్లూ రెండో సెమీఫైనల్‌పైనే ఉన్నాయి. ఈ అర్ధరాత్రి జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్, అర్జెంటీనా తలపడబోతున్నాయి. ఇందులో గెలిచిన మహానుభావులే ఫైనల్లో స్పెయిన్ బుల్‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

హిస్టరీ వర్సెస్ ప్రెజెంట్: రికార్డులు ఓకే.. మరి రిజల్ట్

హిస్టరీ బుక్స్ తిరగేస్తే.. వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 14 సార్లు కొట్టుకున్నాయి. ఇందులో ఇంగ్లండ్ 6 సార్లు గెలిస్తే, అర్జెంటీనా 3 సార్లు మాత్రమే గెలిచింది. మిగతా 5 మ్యాచ్‌లు 'నువ్వు కొట్టినట్లు చేయి.. నేను ఏడ్చినట్లు చేస్తా' అన్నట్టు డ్రా అయ్యాయి. రికార్డుల పరంగా ఇంగ్లండ్‌దే పైచేయిలా కనిపిస్తున్నా.. ప్రజెంట్ ఫామ్ ముందు ఈ పాత రికార్డులు బలాదూర్. అందుకే మ్యాచ్ ముగిసేవరకు ఎవరూ ఏమీ చెప్పలేరు!

మెస్సీ లాస్ట్ రైడ్.. ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు

ఈ మ్యాచ్‌కి అసలైన బజ్ ఎవరయ్యా అంటే.. అది మన లియోనెల్ మెస్సీనే. కెరీర్ ఎండ్ కార్డ్‌కి దగ్గరగా ఉన్న మెస్సీ, ఎలాగైనా దేశానికి మరో వరల్డ్‌కప్ ఇచ్చేసి ఘనంగా రిటైర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. గ్రౌండ్‌లోకి దిగితే చాలు.. వయసుతో సంబంధం లేకుండా మ్యాజిక్ చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మెస్సీ ఫ్యాన్స్ "ప్లీజ్ దేవుడా.. మెస్సీని ఫైనల్‌కి పంపించు" అని అర్ధరాత్రి పూజలు మొదలుపెట్టేశారు. ఈ టోర్నీలో అర్జెంటీనాను ఇక్కడిదాకా లాక్కొచ్చింది మెస్సీ ప్లానింగ్, గోల్స్ వేసే టైమింగే.

ఇంగ్లండ్ సైన్యం.. బిల్డప్ తక్కువ.. ఆట ఎక్కువ

మరోవైపు ఇంగ్లండ్ జట్టు ఎప్పటిలాగే "ఇట్స్ కమింగ్ హోమ్" అంటూ ట్యూన్ కట్టుకుని రెడీగా ఉంది. కాకపోతే ఈసారి వాళ్ల దగ్గర కేవలం బిల్డప్ మాత్రమే లేదు.. గట్టి స్టఫ్ కూడా ఉంది.

డిఫెన్స్ సూపర్.. ఎటాకింగ్ అదిరింది

ఈ టోర్నీలో ఇంగ్లండ్ చాలా పద్ధతిగా ప్లాన్ ప్రకారం ఆడుతోంది. డిఫెన్స్ లో గోడలా నిలబడుతూ మిడ్‌ఫీల్డ్‌ను శాసిస్తూ కౌంటర్ ఎటాక్స్‌తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. యువ ఆటగాళ్ల జోష్, సీనియర్ల ఎక్స్ పీరియన్స్ కలవడంతో ఇంగ్లండ్ టీమ్ భీభత్సమైన ఆత్మవిశ్వాసంతో ఉంది.

తుపాకీ ప్రిడిక్షన్స్ రివర్స్.. మరి ఈసారి?

టోర్నీ మొదలైనప్పుడు ఫ్రాన్స్ మళ్లీ ఛాంపియన్ అవుతుందని అందరూ జ్యోతిష్యం చెప్పారు. మన ‘‘తుపాకీ స్పోర్ట్స్ టీమ్' కూడా అదే నమ్మింది. కానీ స్పెయిన్ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఫైనల్ చేరి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. మరి ఇప్పుడు అర్జెంటీనా గెలుస్తుందా? లేక ఇంగ్లండ్ బావుటా ఎగరేస్తుందా?

ఒక్క క్షణంలో పాచికలు మారిపోయే ఫుట్‌బాల్ గేమ్‌లో ప్రెడిక్షన్లు చేయడం వేస్ట్. సో ఈ అర్ధరాత్రి టీ కప్పు పక్కన పెట్టుకుని, మెస్సీ మ్యాజిక్ గెలుస్తుందో.. లేక ఇంగ్లండ్ సమిష్టి నరమేధం సక్సెస్ అవుతుందో టీవీల ముందు కూర్చుని చూడాల్సిందే!