Begin typing your search above and press return to search.

ఐపీఎల్ సోషల్ మ్యాప్: తలైవా ధోనిని దాటేసిన కింగ్ కోహ్లీ!

దీంతో వీరిద్దరి క్రేజ్ పై టెలివిజన్ ప్రసారదారు జియో హాట్ స్టార్ పెట్టిన పోటీలో ఎవరు గెలిచారో చూద్దాం..

By:  Tupaki Desk   |   28 March 2025 10:26 PM IST
ఐపీఎల్ సోషల్ మ్యాప్: తలైవా ధోనిని దాటేసిన కింగ్ కోహ్లీ!
X

ధోని.. కోహ్లీ.. ఈ ఇద్దరు గురుశిష్యుల్లో ఎవరికి ఎక్కువ క్రేజ్. ఎవరికి సోషల్ మీడియాలో ఎక్కువ బజ్ ఉంది. ఈరోజు చెన్నై వర్సెస్ బెంగళూర మధ్య మ్యాచ్ లో ఈ ఇద్దరూ ఒకేసారి గ్రౌండ్ లో తలపడబోతున్నారు. దీంతో వీరిద్దరి క్రేజ్ పై టెలివిజన్ ప్రసారదారు జియో హాట్ స్టార్ పెట్టిన పోటీలో ఎవరు గెలిచారో చూద్దాం..


భారత ఉపఖండంలో ఎంఎస్ ధోని ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్ అనడంలో సందేహం లేదు. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకుని ఐదు సంవత్సరాలకు పైగా గడిచినా, ఇప్పటికీ ఐపీఎల్‌లో అతనో పెద్ద క్రౌడ్ పుల్లర్‌గా ఉన్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. చెన్నైలోని ప్రఖ్యాత చెపాక్ స్టేడియంలో ఈరోజు చెన్నై వర్సెస్ బెంగళూరు మధ్య హై-ప్రొఫైల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జియో హాట్‌స్టార్ - స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఒక నివేదిక విరాట్ కోహ్లీ వర్సెస్ ఎంఎస్ ధోనిపై జరుగుతున్న సోషల్ మీడియా కార్యకలాపాల ఆధారంగా ఒక సోషల్ మ్యాప్‌ను రూపొందించింది. ఈ సోషల్ మ్యాపింగ్ ప్రకారం.. ఈరోజు జరిగే పెద్ద మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తలైవా ధోని కంటే ప్రజాదరణలో ముందంజలో ఉన్నాడు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై ఉన్న సోషల్ మీడియా హడావిడి విరాట్ కోహ్లీకి 53% ఉండగా.. ధోనికి 47% ఉంది.

ఇది కేవలం ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై జరుగుతున్న సోషల్ మీడియా కార్యకలాపాల కొలమానం మాత్రమే.. కానీ ఇది వారిద్దరి యొక్క నిజమైన ప్రజాదరణను నేరుగా ప్రతిబింబించదు. ఏది ఏమైనప్పటికీ ఈ గణాంకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈరోజు మ్యాచ్ యొక్క ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని ఎవరికి ఎంత సోషల్ మీడియాలో బజ్ ఉన్నదని జియో హాట్ స్టార్ ఈ నివేదిక బయటపెట్టింది. అందులో ధోనిని కోహ్లీ దాటేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా చెన్నై వర్సెస్ బెంగళూరు మధ్య జరిగే హై-ప్రొఫైల్ పోరు ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైంది.. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించాయి. టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించింది. సాల్ట్ 32, కోహ్లీ 31, రజత్ పటిదార్ 51, టిమ్ డేవిడ్ 22 పరుగులు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ప్రస్తుతం చెన్నై ఆదిలోనే 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. బెంగళూరు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాట్స్ మెన్ కు పరుగులు చేయడం కష్టమవుతోంది. గడిచిన 16 ఏళ్లుగా చెన్నై చెపాక్ లో సీఎస్కేను ఆర్సీబీ ఓడించలేదు. ఈరోజు ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.