Begin typing your search above and press return to search.

ఢిల్లీ వర్సెస్ కేకేఆర్... ఇద్దరి బలాబలాలూ ఇవే!

ఇందులో భాగంగా ఢిల్లీ – కేకేఆర్ జట్లు తలపడబోతున్నాయి.

By:  Tupaki Desk   |   3 April 2024 3:57 AM GMT
ఢిల్లీ వర్సెస్  కేకేఆర్... ఇద్దరి బలాబలాలూ ఇవే!
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా 16వ మ్యాచ్ ఏప్రిల్ 3న రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ - శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది.. ఈ మ్యాచ్ కు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ - వీడీసీఏ మైదానం ముస్తాబైంది! ఈ మ్యచ్ లో కేకేఆర్ హాట్ ఫేవరెట్ అని చెబుతున్నా... ఢిల్లీని తక్కువ అంచనా వేయకూడదనేది మరో కామెంట్!!

అవును... ఐపీఎల్ 17 వ సీజన్ లో 16వ మ్యాచ్ కు విశాఖలోని డా. వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. ఇందులో భాగంగా ఢిల్లీ – కేకేఆర్ జట్లు తలపడబోతున్నాయి. అంతక ముందు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కేకేఆర్ టాప్ ఆర్డర్ అంతా కలిసి కట్టుగా రాణించారు.

ఇందులో భాగంగా... సాల్ట్ (30), సునీల్ నరైన్ (47), వెంకటేష్ అయ్యర్ (50), శ్రేయస్ అయ్యర్ (39) పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా, ఆండ్రూ రస్సెల్ లు రాణించారు. ఈ టీం వర్కే కేకేఆర్ కు ప్లస్ గా మారింది. ఫలితంగా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి +1.047 నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

మరోపక్క... గత మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై 20 పరుగుల తేడాతో విక్టరీ సాధించి బోణీ కొట్టిన ఢిల్లీ జోరుమీదుంది! అయితే.. అంతకు ముందు ఆడిన 2 మ్యాచ్ లలోనూ ఓడిపోయిన ఢిల్లీ... చెన్నైతో మ్యాచ్ లో గెలిచినప్పటికీ -0.016 నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో 7 స్థానానికి పరిమితమైంది!!

ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్స్ లో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ లు బ్యాట్ తో రాణించడంతో పాటు.. ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ లు బంతితో రాణించారు. దీంతో... ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు కూడా గెలిచిన ఉత్సాహంలోనే బరిలోకి దిగుతుంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరగంగా సాగే అవకాశం ఉంది!

హేడ్ - టు - హెడ్:

ఐపీఎల్ టోర్నమెంట్స్ లో ఈ రెండు జట్లూ ఇప్పటివరకూ 32 మ్యాచ్ లు ఆడాయి. వీటిలో ఢిల్లీ 15 మ్యాచ్ లలో గెలుపొందగా.. కేకేఆర్ 16 మ్యాచ్ లలో విక్టరీ సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఇక కోల్ కతాపై ఢిల్లీ అత్యధిక స్కోరు 228 కాగా... ఢిల్లీపై కేకేఆర్ అత్యధిక స్కోరు 210.

పిచ్ రిపోర్ట్:

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం విషయనికొస్తే... ఇది స్లో వికెట్‌ గా బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్స్లు స్వింగ్ చేయడానికి చాలా సహాయం చేస్తుందని.. సెకండ్ ఆఫ్ లో స్పిన్నర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.