Begin typing your search above and press return to search.

కోహ్లీ 49వ సెంచరీ ఎంత స్పెషల్ అంటే?

రంగం ఏదైనా రికార్డులకు కొదవ ఉండదు. కానీ.. కొన్ని రికార్డులు అపురూపంగా ఉంటాయి. అప్పటివరకు వారికున్న ఐడెంటిటీని మరింత స్పెషల్ గా మారుస్తాయి.

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:31 AM GMT
కోహ్లీ 49వ సెంచరీ ఎంత స్పెషల్ అంటే?
X

రంగం ఏదైనా రికార్డులకు కొదవ ఉండదు. కానీ.. కొన్ని రికార్డులు అపురూపంగా ఉంటాయి. అప్పటివరకు వారికున్న ఐడెంటిటీని మరింత స్పెషల్ గా మారుస్తాయి. క్రికెట్ దేవుడిగా పేరున్న సచిన్ సాధించిన రికార్డుకు దుమ్ము రేపాడు విరాట్ కోహ్లీ. తన పుట్టిన రోజున అతగాడు సాధించిన 49వ సెంచరీ సో స్పెషల్ గా మారింది. బర్త్ డే బాయ్ సాధించిన సెంచరీ దేశ ప్రజలకు స్పెషల్ పార్టీగా మారింది. ఎందుకంటే.. వన్డే చరిత్రలో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా సచిన్ పేరుతో ఉన్న రికార్డును తాజాగా సమం చేశాడు కోహ్లీ.

మరో ఆసక్తికరమైన వవిషయం ఏమంటే.. తన తొలి వన్డే శతకాన్ని ఎక్కడైతే షురూ చేశాడో.. తాజాగా రికార్డు సెంచరీని సైతం అక్కడే చేయటం మరింత ప్రత్యేకమని చెప్పాలి. 2009లో శ్రీలంకపై ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తన తొలి సెంచరీని సాధించాడు. కట్ చేస్తే.. తాజాగా 49వ సెంచరీని సాధించి.. సచిన్ రికార్డును సమం చేశారు.

సుదీర్ఘ చరిత్ర కలిగిన వన్డే క్రికెట్ లో ఇప్పటివరకు సచిన్.. కోహ్లీలు మాత్రమే 35 సెంచరీలకు పైగా నమోదు చేశారంటేనే.. ఈ రికార్డు ఎంత ఇస్పెషల్ అన్నది అర్థమవుతుంది. తాజాగా ఈడెన్ గార్డెన్ లో సౌతాఫిక్రాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాన్ని సాధించటం ఒక ఎత్తు అయితే.. ఈ మ్యాచ్ లో చిరస్మరణీయమైన సెంచరీని సాధించిన కోహ్లీ.. రికార్డుల దుమ్ము రేపాడు. తన పుట్టిన రోజున అతగాడి సాధించిన సెంచరీని దేశ క్రికెట్ అభిమానులంతా విరాట్ తమకిచ్చిన బర్త్ డే పార్టీగా ఫీలయ్యారంటే అతిశయోక్తి కాదు.

కోహ్లీ సాధించిన 49వ సెంచరీ నేపథ్యంలో.. సచిన్ రికార్డును సమం చేయటం తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన రికార్డు సెంచరీల ప్రత్యేకతను ఒకసారి చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

- వన్డేల్లో 49 సెంచరీలు సాధించటం క్రికెట్ చరిత్రలో ఎవరూ చేయలేదు. ఆ రికార్డును సచిన్ సాధించిన 11 ఏళ్లకే కోహ్లీ చేరుకున్నాడు.

- సచిన్ 452వ ఇన్నింగ్స్ లో 49 సెంచరీలు సాధిస్తే.. కోహ్లీ 277వ ఇన్నింగ్స్ లో ఆ రికార్డును సమం చేశారు.

- సచిన్ 463 మ్యాచ్ లో 49 సెంచరీలు సాధిస్తే.. కోహ్లీ 289వ మ్యాచ్ లోనే శతకొట్టేశాడు.

- సచిన్ సాధించిన 49 సెంచరీల్లో భారత్ 33 సార్లు గెలిస్తే.. కోహ్లీ సాధించిన 49 శతకాల్లో 40 మ్యాచ్ లో టీమిండియా గెలిచింది.

- స్వదేశంలో 23 సెంచరీలు చేసిన కోహ్లీ విదేశాల్లో 26 సెంచరీలు సాధించటం విశేషం.

- వన్డే క్రికెట్ లో సచిన్ 18,426 అత్యధిక పరుగల రికార్డుకు కోహ్లీ 13,626 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు అతనిదే.

- ప్రస్తుత క్రికెటర్లలో రోహిత్ మినహా మరే ఆటగాడు 10వేల పరుగులు చేసింది లేదు.

- వన్డేల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు.. 9 వేల పరుగులు.. 10వేల పరుగులు.. 11 వేల పరుగులు.. 12, 13 వేల పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే.

- వన్డేల్లో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా కోహ్లీ త్వరలో నిలుస్తాడు.

- అయితే.. అన్ని ఫార్మాట్ ల్లో కలిసి సచిన్ 100 సెంచరీలు సాధించగా..ఈ రికార్డు విషయంలో మాత్రం కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఇప్పటికి అతను 79 సెంచరీలు మాత్రమే చేశారు. మరో 21 సెంచరీలు చేయటమంటే మాటలు కాదు. ఈ కరికార్డును బ్రేక్ చేయాలంటే కోహ్లీ మరింత దూకుడుగా ఆడాల్సి ఉంటుంది.

- సచిన్ సాధించిన 49 సెంచరీల్లో అత్యధికం ఆస్ట్రేలియా జట్టు మీద 9, శ్రీలంక జట్టు మీద 8, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఐదేసి చొప్పున సెంచరీలు సాధించారు. ఇక.. కోహ్లీ విషయానికి వస్తే తాను సాధించిన 49సెంచరీల్లో అత్యధికం శ్రీలంక మీద 10, వెస్టిండీస్ మీద 9, ఆస్ట్రేలియా మీద 8 సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మీద ఐదేసి చొప్పున చేశాడు.