Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఫ్యాన్స్ టచ్ చేస్తున్నారు...బాబర్ ఫుల్ హ్యాపీ!

ప్రస్తుతం వరల్డ్ కప్ సందడి.. సందడి సందడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పైగా హైదరాబాద్ లో దిగినప్పటినుంచీ పాకిస్థాన్ టీం మెంబర్స్ ఫుల్ చిల్ అవుతున్నారు

By:  Tupaki Desk   |   7 Oct 2023 4:30 AM GMT
హైదరాబాద్ ఫ్యాన్స్ టచ్ చేస్తున్నారు...బాబర్ ఫుల్ హ్యాపీ!
X

ప్రస్తుతం వరల్డ్ కప్ సందడి.. సందడి సందడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పైగా హైదరాబాద్ లో దిగినప్పటినుంచీ పాకిస్థాన్ టీం మెంబర్స్ ఫుల్ చిల్ అవుతున్నారు. హైదరబాద్ బిరియానీకి రేటింగ్స్ ఇస్తున్నారు. భారత్ ఆతిధ్యం సూపర్ అంటూ సంబరపడిపోతున్నారు. ఈ సమయంలో తాజాగా హైదరాబాద్ ఫ్యాన్స్ కి ఆకాశానికెత్తేశాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం.

అవును... బ్యాటింగ్‌ లో, బౌలింగ్‌ లో మొదట్లో కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న పాకిస్థాన్... నెదర్లాండ్స్‌ పై విజయంతో ప్రపంచకప్‌ లో బోణీ కొట్టింది. ఈ సందర్భంగా స్పందించిన పాక్ కెప్టెన్ బాబర్... సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్ సూపర్ బ్యాటింగ్‌ కు తోడు బౌలర్లు సత్తా చాటడంతోనే వన్డే ప్రపంచకప్‌ 2023లో శుభారంభం చేసామని తెలిపాడు.

అనంతరం... స్టేడియంలో వారికి దొరుకుతున్న మద్దతుకు బాబర్ ఫిదా అయిపోయినట్లు చెబుతున్నాడు. ఇందులో భాగంగా... హైదరాబాద్ అభిమానుల మద్దతుకు ఫిదా అవుతున్నట్లు తెలిపిన బాబర్... సొంత అభిమానుల్లా తమకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఇదే సమయంలో భారత్ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపాడు.

ఇక ఈ మ్యాచ్ ఫలితం పట్ల తాను సంతృప్తిగా ఉన్నాను అని తెలిపిన బాబర్... ఈ విజయం క్రెడిట్ బౌలర్లదే అని అన్నాడు.

కాగా... శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ లో పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ పై విజయం సాధించింది. పేసర్‌ బాస్‌ డి లీడ్‌ (4/62) సహా నెదర్లాండ్స్‌ బౌలర్లంతా సమష్టిగా సత్తాచాటడంతో మొదట పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్‌ విఫలమైంది. పాక్‌ బౌలింగ్‌ ను ఎదుర్కోలేక 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది.

మరోపక్క ప్రపంచకప్‌ లో వరుసగా రెండో మ్యాచ్‌ కూ కూడా ప్రేక్షకులు కరవయ్యారు. అహ్మదాబాద్‌ లో జరిగిన మ్యాచ్ మాదిరిగానే హైదరాబాద్‌ ఉప్పల్ లో జరిగిన ప్రపంచకప్‌ పోరు చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. సుమారు 39,000 సామర్థ్యమున్న ఉప్పల్‌ క్రికెట్ స్టేడియంలో మాగ్జిమం 9,000 వేల మంది మాత్రమే మ్యాచ్‌ కు హాజరయ్యారు.