Begin typing your search above and press return to search.

'ఢాకా'కు డుమ్మా.. కనీసం మీటింగ్ కూ రాం.. బంగ్లాకు బీసీసీఐ షాక్

సరిగ్గా గత ఏడాది ఆగస్టులో ఇదే రోజుల్లో బంగ్లాదేశ్ అట్టుడికింది.. ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటుతో పొరుగున తీవ్ర కల్లోలం రేగింది..

By:  Tupaki Desk   |   11 July 2025 8:00 PM IST
ఢాకాకు డుమ్మా.. కనీసం మీటింగ్ కూ రాం.. బంగ్లాకు బీసీసీఐ షాక్
X

సరిగ్గా గత ఏడాది ఆగస్టులో ఇదే రోజుల్లో బంగ్లాదేశ్ అట్టుడికింది.. ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటుతో పొరుగున తీవ్ర కల్లోలం రేగింది.. చివరకు క్రికెటర్ల ఇంటిపైనా దాడులు జరిగాయి.. ప్రధానమంత్రి హుటాహుటిన భారత్ కు వచ్చేశారు.. ఇక క్రికెటర్లు కొందరు తమ దేశానికి వెళ్లేందుకు కూడా జంకారు.. అప్పటినుంచి బంగ్లాదేశ్ లో క్రికెట్ అనేదే లేదు. బంగ్లాదేశ్ జట్టు విదేశాలకు వెళ్లి సిరీస్ లు ఆడుతోంది.

ఇక బంగ్లాదేశ్ తో వచ్చే నెలలో టీమ్ ఇండియా వన్డే, టి20 సిరీస్ లు ఆడాల్సి ఉంది. అక్కడి పరిస్థితుల రీత్యా వాటిని రద్దు చేసింది బీసీసీఐ. ఆ సమయంలోనే శ్రీలంక టూర్ చేసేందుకు ఆలోచిస్తోంది. దీంతో బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చినట్లయింది. పైకి మాత్రం అంతర్జాతీయ షెడ్యూల్ కఠినంగా ఉందని కారణం చెప్పింది. వాస్తవం మాత్రం.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు ఇది షాక్.

ఇక సెప్టెంబరులో ఆసియా కప్ జరగనుంది. దీనికి వేదిక భారత్. అయితే, దీనిపైనా అనుమానాలు వస్తున్నాయి. ఈ నెల చివర్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం బంగ్లా రాజధాని ఢాకాలో జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కాబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. మనతో పాటు శ్రీలంక కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని పాకిస్థాన్ అంటోంది. ఆన్ లైన్ లో అయినా సమావేశం జరుగుతుందని పేర్కొంటోంది.

సెప్టెంబరులో ఆసియా కప్ నిర్వహణ భారత్ లోనే ఉంది. పాకిస్థాన్ రావాల్సి ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తో క్రికెట్ సంబంధాల పట్ల భారత్ చాలా స్పష్టంగా ఉంది. పాక్ జట్టు మన దేశానికి వచ్చేందుకు అంగీకరించదు. టోర్నీని వేరే చోటుకు మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ను బీసీసీఐ కోరనుంది. టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ కూడా చెప్పినందున.. యూఏఈలో జరగనుందని సమాచారం.