Begin typing your search above and press return to search.

ఐపీఎల్.. హర్షాతిరేకం.. హర్షిత్ కో న్యాయం.. కోహ్లికో న్యాయమా?

ఈ ఏడాది ఐపీఎల్ లో ల‌క్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీకి రెండోసారి ఫైన్ ప‌డింది.

By:  Tupaki Desk   |   21 April 2025 5:30 PM IST
ఐపీఎల్.. హర్షాతిరేకం.. హర్షిత్ కో న్యాయం.. కోహ్లికో న్యాయమా?
X

ఈ ఏడాది ఐపీఎల్ లో ల‌క్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీకి రెండోసారి ఫైన్ ప‌డింది. మ్యాచ్ ఫీజులో అత‌ను 50 శాతం ఫైన్ క‌ట్టాల్సి వ‌చ్చింది. బ్యాటర్ న‌మ‌న్ ధీర్‌ ను ఔట్ చేసిన త‌ర్వాత నోట్‌ బుక్ టిక్ సెల‌బ్రేష‌న్ ద్వారా ఐపీఎల్‌ లోని లెవ‌ల్‌-1 ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి కోడ్‌ ఉల్లంఘించడమే దీనికి కారణం. ఓ డీ మెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. పంజాబ్‌తో మ్యాచ్‌ లోనూ ఫైన్ పడడంతో అత‌డి డీమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరుకున్న‌ది.

ఇక నిరుడు సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ బ్యాట్స్ మన్ మయాంక్ అగర్వాల్‌ ను అవుట్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా అతడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. క్లాసెన్ వికెట్ తీశాక పెవిలియన్‌ వెళ్లమని సైగ చేశాడు. దీంతో రాణాకు 60 శాతం జరిమానా విధించారు. ఢిల్లీతో మ్యాచ్ లో అభిషేక్ పోరెల్ వికెట్ తీశాక అతడిని బయటకు వెళ్లమని చేతితో సంజ్ఞ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇలా వరుసగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో రాణాపై ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించారు.

మరి.. ఆదివారం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి చేసిన పనికి శిక్ష లేదా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్‌ గెలిచాక విరాట్.. శ్రేయాస్ అయ్యర్ ను చూస్తూ చేసిన హావభావాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాఠీ, రాణాలకు ఒక న్యాయం, కోహ్లికి ఒక న్యాయమా? అని నిలదీస్తున్నారు.

వాస్తవానికి టీమ్ ఇండియా సభ్యులైన కోహ్లి, అయ్యర్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. కాకాపోతే, కోహ్లి అతడికి చాలా సీనియర్. స్థాయిలోనూ చాలా తేడా ఉంది. అయినా, కోహ్లి తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోవడం పట్ల అభ్యంతరాలు వస్తున్నా

అందుకే పక్షపాతానికి తావు లేకుండా బీసీసీఐ చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.