Begin typing your search above and press return to search.

ఆడిన రెండో మ్యాచ్ లోనే నాలుగో ప్లేస్ కి... మయంక్ సరికొత్త చరిత్ర!

ఆడిన రెండు మ్యాచ్ లలోనూ రికార్డులు నెలకొల్పాడు! ఈ క్రమంలో తన లక్ష్యం ఏమిటో చెబుతున్నాడు!

By:  Tupaki Desk   |   3 April 2024 5:42 AM GMT
ఆడిన రెండో మ్యాచ్  లోనే నాలుగో ప్లేస్  కి... మయంక్  సరికొత్త చరిత్ర!
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024లో బ్యాటింగ్ విభాగంలో చాలా పేర్లు రెగ్యులర్ గా ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ... బౌలింగ్ విభాగానికి వచ్చే సరికి ఒక పేరు మాత్రం గత నాలుగైదు రోజులుగా విపరీతంగా వైరల్ అవుతోంది. అదే... మయంక్ యాదవ్! ఢిల్లీకి చెందిన ఈ యువ సంచలనం ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ రికార్డులు నెలకొల్పాడు! ఈ క్రమంలో తన లక్ష్యం ఏమిటో చెబుతున్నాడు!

అవును... పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన మయంక్ అగర్వాల్ తనదైన వేగంతో కూడిన కశ్చితత్వం కలిగిన బంతులను విసిరాడు. ఇందులో భాగంగా గంటకు 155కి.మీ. పైచిలుకు వేగంతో బ్యాటర్లను వణికించే ప్రయత్నం చేశాడు. రెప్పపాటులో బాల్.. బ్యాట్స్ మెన్ ని దాటి కీపర్ చేతిలోకి వెళ్తున్న సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి! ఈ క్రమంలో తన తొలి మ్యాచ్ లో 4-12-27-3 (4 ఓవర్స్, 12 డాట్ బాల్స్, 27 రన్స్, 3 వికెట్స్) గణాంకాలను నమోదు చేశాడు.

దీంతో ఆ మ్యాచ్ లో “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు గెలుచుకున్నాడు. ఆడిన తొలిమ్యాచ్ లోనే ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ చేయడంతోపాటు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడంతో మయంక్ యాదవ్ పేరు ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇదే క్రమంలో తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మయంక్. ఈసారి మరింత వేగంగా బతులు వేయడంతో పాటు.. బ్యాటర్స్ ని వణికించేశాడనే కామెంట్లను సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో మయంక్ యాదవ్ మరో అద్భుతమైన స్పెల్ వేశాడు. ఇందులో భాగంగా... 4-17-14-3 (4 ఓవర్స్, 17 డాట్ బాల్స్, 14 రన్స్, 3 వికెట్స్) తో చెలరేగాడు. దీంతో.. ఈ సీజన్ లో ఫస్ట్ టైం తమ ప్రత్యర్థి టీం ఆలౌట్ అవ్వడంలో కీరోల్ పోషించాడు! ఫలితంగా మరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కించుకున్నాడు. దీంతో... ఇప్పుడు మయంక్ యాదవ్ ఒక స్టార్ క్రికెటర్ గా మారిపోయాడని చెబుతున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన మయంక్ యాదవ్... తన లక్ష్యం ఏమిటనే విషయన్ని వెల్లడించాడు. ఇందులో భాగంగా... వరుసగా రెండు మ్యాచ్ లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఇదే సమయంలో... ఎప్పటికైనా దేశానికి ఆడటమే తన అంతిమ లక్ష్యం అని.. తన ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టానని తెలిపాడు. అదేవిధంగా... కామెరూన్ గ్రీన్ వికెట్ తీసినందుకు తనకు ఎంతో సంతొషంగా ఉందని మయంక్ యాదవ్ వెల్లడించాడు.

కాగా ఆడిన తొలి మ్యాచ్ లోనే సంచలన బౌలింగ్ తో సర్వత్రా ప్రశంసలు అందుకున్న మయంక్... రెండో ఓవర్ లోనూ అంతకు మించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ మయాంక్.. రెగ్యులర్ గా గంటకు 150 కి.మీ. వేగంతో బంతులు వేస్తూ... ఒక బంతిని మాత్రం 156.7 కి.మీ. వేగంతో వేశాడు. దీంతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇందులో భాగంగా.. ఐపీఎల్ టోర్నీలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేసినవారి జాబితాలో టాప్ 4 కి చేరుకున్నాడు.

ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ బాల్స్ వేసిన వారి టాప్ 5 జాబితా:

షాన్ టైట్ - 2011 - 157.7

లాకీ ఫెర్గూసన్ - 2022 - 157.3

ఉమ్రాన్ మాలిక్ - 2022 - 157.0

మయంక్ యాదవ్ - 2024 - 156.7

అన్రిచ్ నార్ట్జే - 2020 - 156.2