Begin typing your search above and press return to search.

ఆసీస్ వరల్డ్ కప్ జట్టులో మనోడు.. అదెలా సాధ్యమైందంటే?

తాజాగా భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో సెలెక్టు అయ్యాడు

By:  Tupaki Desk   |   8 Aug 2023 5:55 AM GMT
ఆసీస్ వరల్డ్ కప్ జట్టులో మనోడు.. అదెలా సాధ్యమైందంటే?
X

కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పటికే భారతీయులు.. భారత సంతతికి చెందిన వారు తమ సత్తా చాటటం.. అత్యుత్తమ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉండటం తెలిసిందే. రాజకీయంగా కూడా భారత సంతతికి చెందిన వారు తమ సత్తా చాటుతున్నారు. ఇలాంటి వేళ.. వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాడు ఎంపిక కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అతడొక ట్యాక్సీ డ్రైవర్ కొడుకు కావటం మరో విశేషం. ప్రతిభతో తప్పించి మరే కారణంగా ఎంపికకు వీల్లేని ఆసీస్ జట్టులో తన సత్తా చాటి మరీ ఎంట్రీ కొట్టేశాడీ యువకుడు. అతడి పేరు తన్వీర్ సంఘా.

తన్వీర్ తండ్రి పంజాబ్ లోని జలంధర్ ప్రాంతానికి చెందిన వారు. 1997లో అతడి కుటుంబం సిడ్నీకి వలస వెళ్లింది. అప్పటి నుంచి తన్వీర్ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నారు. లెగ్ స్పిన్నర్ గా ఎదిగిన తన్వీర్ 2020 అండర్ 19 ప్రపంచకప్ పోటీల్లో ఆసీస్ తరఫున ఆడి.. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచారు. తర్వాత జరిగిన బిగ్ బాష్ పోటీల్లోనూ తన సత్తా చాటాడు.

న్యూజిలాండ్ తో 2021లో జరిగిన టీ20 సిరీస్ కు ఎంపికైన ఇతడు.. తాజాగా భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో సెలెక్టు అయ్యాడు. మొత్తం18 మంది ఆటగాళ్ల టీంలో చోటు దక్కించుకున్న తన్వీర్ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొడుకు గురించి తన్వీర్ తండ్రి మాట్లాడుతూ.. తాను భారత్ లో ఎప్పుడూ క్రికెట్ చూసేవాడిని కాదని.. రెజ్లింగ్ ను ఇష్టపడినట్లు చెప్పారు. రెజ్లింగ్ లోతన కొడుకు జూనియర్ స్థాయిలో ఆడాడు కానీ ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత మాత్రం క్రికెట్ అకాడమీలో చేర్చినట్లు చెప్పారు. మరి.. మనోడి మెరుపులు ఏమిటన్నది రానున్న టోర్నీలో తేలనుంది.