Begin typing your search above and press return to search.

హైదరాబాదీ ధాటికి ఫైనల్లో టీమిండియా.. బంగారు కప్ కొటేసినట్టే?

తిలక్ 26 బంతుల్లో 2 ఫోర్లు, ఏకంగా 6 సిక్సులు బాది (55 పరుగులు చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (40 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 7:17 AM GMT
హైదరాబాదీ ధాటికి ఫైనల్లో టీమిండియా.. బంగారు కప్ కొటేసినట్టే?
X

టీమిండియా దులిపేసింది.. ప్రత్యర్థి దుమ్మరేపింది. వరుసగా రెండో గెలుపుతో ఫైనల్లోకి చేరింది. ఇక మరొక్క విజయమే.. బంగారు కప్ అందుతుంది. అదేంటి..? ప్రపంచ కప్ నిన్ననే కద మొదలైంది.. ఇంతలో ఫైనల్ ఏంటి? టీమిండియా ఫైనల్ కు చేరడం ఏమిటి? జరుగుతున్నది ప్రపంచ కప్ అయితే బంగారు కప్ దక్కనుండడం ఏమిటి? అనేగా మీ సందేహం..కానీ, ఇది వాస్తవమే. కాకపోతే కాస్త తిరకాసు.

అటో జట్టు.. ఇటో జట్టు..

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో కొన్ని దేశాలు ఒక అంతర్జాతీయ స్థాయి జట్టునే తయారు చేసుకోలేకపోతున్నాయి. టీమిండియా మాత్రం మూడు జట్లను సిద్ధం చేసుకోగలిగేంత రిజర్వ్ బెంగ్ ను కలిగి ఉంది. అందుకే ఒకేసారి వేర్వేరు టోర్నీల్లో వేర్వేరు బలమైన జట్లను దింపగలుగుతోంది. ఇప్పుడు చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలకూ ఇలానే బలమైన జట్టును పంపింది. కాగా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆసియా కప్ ఆడుతున్న టీమిండియా.. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.

హైహై హైదరాబాదీ తిలక్

జెంటిల్మన్ గేమ్ అయినా.. క్రికెట్ అంటే విచిత్రమైన క్రీడ. నిన్నటి హీరోలు.. నేడు జీరోలవుతారు. అంటే.. ఒకరోజు సెంచరీ కొట్టినవాడు మరుసటి రోజు సున్నాకే ఔటవుతాడు. ఈ రోజు సున్నాకే ఔటైనవాడు రేపు సెంచరీ కొడతాడు. అచ్చం ఆసియాకప్ సెమీస్ లో బంగ్లాదేశ్ పై ఇలానే జరిగింది. ఇందులో హైదరాబాదీ ఎడమచేతి వాటం యువ బ్యాటర్ తిలక్‌ వర్మ హాఫ్ సెంచరీ తో మెరిశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌ ఒక్క వికెట్‌ను మాత్రమే నష్టపోయి 9.2 ఓవర్లలో 97 పరుగులు చేసింది. 9 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది తిలక్ ఆట గురించే. తిలక్ 26 బంతుల్లో 2 ఫోర్లు, ఏకంగా 6 సిక్సులు బాది (55 పరుగులు చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (40 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, బుధవారం నేపాల్‌పై సెంచరీ సాధించిన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్‌ అయ్యాడు. పిచ్ బౌలర్లకు సహకరిస్తున్నా.. తిలక్ చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. దూకుడుగా ఆడాడు. శనివారం ఆసియా కప్ ఫైనల్‌ జరగనుంది. పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌లో విజేతతో స్వర్ణం కోసం తలపడాలి. ప్రస్తుతం పాకిస్థాన్ 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.