Begin typing your search above and press return to search.

కొత్త రికార్డ్... ఆ విషయంలో విరాట్ ను మించిన మిస్టర్ టీ-20

ఈ సమయంలో 13ఏళ్ల క్రితం నాటి కొహ్లీ రికార్డ్ ఒకటి తాజాగా సమం అయ్యింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 4:55 AM GMT
కొత్త రికార్డ్... ఆ విషయంలో విరాట్  ను మించిన మిస్టర్  టీ-20
X

భారత క్రికెట్ టీంలో విరాట్ కొహ్లీ గురించి ఏమీ చెప్పుకోనవసరం లేదు. అతడి పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో రికరడులు మీద రికార్డులు సృష్టించిన కొహ్లీకి ఇక తిరుగులేదనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో 13ఏళ్ల క్రితం నాటి కొహ్లీ రికార్డ్ ఒకటి తాజాగా సమం అయ్యింది. ఆ అరుదైన రికార్డును మిస్టర్ టీ20 సూర్య కుమార్ యాదవ్ సాధించాడు. అది కూడా ఇంకాస్త బెటర్ గా కావడం గమనార్హం!

అవును... టీం ఇండియాలో ఎంతోమంది స్టార్ బ్యాటర్స్ ఉన్నప్పటికీ గతకొంతకాలంగా టీ20 మ్యాచ్ అనేసరికి అందరికళ్లూ సూర్యకుమార్ యాదవ్ వైపు మళ్లుతాయనడంలో అతిశయోక్తి లేదు. క్రీజ్ లో డ్యాన్స్ చేసినట్లుగా 360 డిగ్రీల్లోనూ షాట్స్ ఆడగల బ్యాటర్ గా పొట్టి ఫార్మెట్ లో అతడికి పేరుంది. దీంతో... తాజాగా అరుదైన ఘనత సాధించాడు. 13 ఏళ్ల విరాట్ కొహ్లీ రికార్డును ఇంకాస్త బెటర్ గా సమం చేశాడు.

ఇందులో భాగంగా... గత రెండు సంవత్సరాలుగా టీ-20 ఫార్మాట్లో పరుగుల మోత మోగిస్తున్న సూర్యకుమార్ యాదవ్... అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరిన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. దీంతో 13 ఏళ్ల క్రితం విరాట్ కొహ్లీ నెలకొల్పిన 56 ఇన్నింగ్స్ రికార్డును సమం చేయగలిగాడు. విరాట్ కొహ్లీ 60 మ్యాచ్ లు, 56 ఇన్నింగ్స్ లో సాధించిన రికార్డును.. సూర్య 59 మ్యాచ్ లు 56 ఇన్నింగ్స్ లోనే అధిగమించగలిగాడు.

2010 సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ పై జరిగిన మ్యాచ్ లో విరాట్ ఈ ఫీట్ ను సాధించాడు. ఆ తర్వాత సుమారు 13ఏళ్ల అనంతరం ఈ ఫీట్ ను తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో సూర్య అందుకున్నాడు. ఈ ఫార్మేట్ లో భారత్ తరపున తన 59వ మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ యాదవ్... తాజాగా ఆడిన 56 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డు నమోదు చేయగలిగాడు.

వాస్తవానికి ఇటీవల స్వదేశంలో ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ లోనే 2వేల పరుగుల మైలురాయిని చేరాల్సిన ఉండగా... ఆఖరి రెండు మ్యాచ్ ల్లోనూ విఫలమవడంతో... దక్షిణాఫ్రికాతో సిరీస్ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో... తాజాగా దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ లో భాగంగా జరిగిన రెండోమ్యాచ్ లో 28 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా సూర్య ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

కాగా... తాజాగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి అడుగుపెట్టిన సూర్య ప్రారంభం నుంచీ ఎదురుదాడికి దిగాడు. 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు సాధించాడు.