Begin typing your search above and press return to search.

క్రికెటర్లు నగ్న ఫొటోలు పంపారు.. ఆమెగా మారిన అతడి సంచలన ఆరోపణలు!

ఓ క్రికెటర్ గా సంజయ్ బంగర్ మీద ఆరోపణలు లేకున్నా.. అతడి ’కుమారుడు’ మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే, ఆ కుమారుడు కుమార్తెగా మారి గత ఏడాది వార్తల్లో నిలిచాడు.

By:  Tupaki Desk   |   18 April 2025 3:02 PM IST
Anaya Banger
X

సంజయ్ బంగర్.. భారత క్రికెట్లో దశాబ్దాలుగా అందరికీ తెలిసిన పేరు. పెద్దగా పేరు లేని రైల్వేస్ జట్టుకు దేశవాళీ క్రికెట్ లో చాలా బాగా ఆడి టీమ్ ఇండియాకు సెలక్ట్ అయి.. కోచ్ గానూ పనిచేశాడు. ఒకప్పటి దక్కన్ చార్జర్స్ ప్రస్తుత సన్ రైజర్స్ కు కూడా ఆడాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ క్రికెట్ డెవలప్ మెంట్ హెడ్ గా పనిచేస్తున్నాడు.

ఓ క్రికెటర్ గా సంజయ్ బంగర్ మీద ఆరోపణలు లేకున్నా.. అతడి ’కుమారుడు’ మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే, ఆ కుమారుడు కుమార్తెగా మారి గత ఏడాది వార్తల్లో నిలిచాడు. సంజయ్ బంగర్ కు ఆర్యన్ అనే కుమారుడు ఉండేవాడు. అయితే, అతడు ఇప్పటికీ ఉన్నాడు. కానీ, ఆమెగా మారాడు. అనయగా పేరు మార్చుకుని లింగ మార్పిడి అనంతరం లండన్ లో ఉంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అనయ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. లింగమార్పిడి చేయించుకున్న కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అనయ తెలిపింది.

ప్రస్తుతం 23 ఏళ్ల వయసున్న అనయ.. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్ అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ తో కలిసి అబ్బాయిల క్రికెట్ ఆడింది. అయితే, తనకు 8, 9 ఏళ్ల వయసులో ఉండగా తనలో అమ్మాయి ఆలోచనలు వచ్చాయని తెలిపింది. ఆ సమయంలో తన తల్లి కప్ బోర్డులో నుంచి దుస్తులు తీసుకోవడం అలవాటైందని.. వాటిని వేసుకుని అద్దంలో చూసుకోవడం.. అమ్మాయిని అని అలానే ఉండాలని అనుకున్నానని చెప్పింది. అబ్బాయిలతో క్రికెట్ ఆడేటప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదని పేర్కొంది.

తాను అమ్మాయిగా మారాక కొందరు సహచర క్రికెటర్లు మద్దతు తెలిపారని, మరికొందరు వేధించారని అనయ చెప్పింది. ఇలాంటి వారిలో కొందరు నగ్న ఫొటోలు పంపారని.. అందరిముందు మద్దతుగా మాట్లాడి.. ఎవరూ లేనప్పుడు మాత్రం పక్కన కూర్చోమని, తన ఫొటోలు పంపమని అడిగేవాడని అనయ పేర్కొంది.

వెటరన్ కు గోడు చెప్పుకొంటే..

లండన్ ఉంటున్న అనయ.. భారత్ లో ఉన్న సమయంలో ఓ వెటరన్ క్రికెటర్ తో తన గోడు వెళ్లబోసుకుంటే.. కారులో బయటకు వెళ్దామని చెప్పి.. తనతో పడుకోమన్నాడని వాపోయింది. కాగా, అబ్బాయిగా ఉన్నప్పడు అనయ ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడింది. గత ఏడాది అమ్మాయిగా మారింది. అయితే, 2023 నవంబరులో మహిళ క్రొకెట్లోకి లింగ మార్పిడి చేసుకున్న వారికి అవకాశం లేదని ఐసీసీ రూల్ తెచ్చింది. దీంతో అనయకు చాన్స్ లేకపోయింది. ఆమె దీనిని సోషల్ మీడియాలోనూ ప్రశ్నించింది.