మహిళల క్రికెట్లోకి మాజీ ’పురుషుడు’..సీనియర్ క్రికెటర్ కూతురి దుమారం
తాజాగా ఓ వివాదం బయటకు వస్తోంది. అబ్బాయిగా ఓ స్థాయి వరకు క్రికెట్ ఆడి ఆ తర్వాత అమ్మాయిగా మారిన యువకుడు మహిళల క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 20 May 2025 7:00 PM ISTప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. మహిళల ఆటలోనూ నాణ్యత కనిపిస్తోంది. దీంతో వారికోసం లీగ్ నిర్వహిస్తున్నారు. భారత్ లో అయితే అమ్మాయిల క్రికెట్ కు ముందుముందు మంచి భవిష్యత్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. శారీరక స్ట్రెంత్ కారణంగా.. పురుషులతో పోలిస్తే మహిళలు ఎంతైనా సున్నితమే. అందుకనే కొన్ని స్పష్టమైన నిబంధనలను పొందుపర్చారు. మరీ ముఖ్యంగా లింగమార్పిడి చేసుకున్న పురుషులకు మహిళల క్రికెట్ లోకి ఎంట్రీ లేదు.
తాజాగా ఓ వివాదం బయటకు వస్తోంది. అబ్బాయిగా ఓ స్థాయి వరకు క్రికెట్ ఆడి ఆ తర్వాత అమ్మాయిగా మారిన యువకుడు మహిళల క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు.. టీమ్ఇండియా మాజీ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు (కుమార్తె). బంగర్ కుమారుడి పేరు ఆర్యన్ బంగర్. అతడు లింగమార్పిడి చేయించుకున్నాడు. అలా అనన్య బంగర్ గా మారింది.
ప్రస్తుత టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వంటి వారితో కలిసి ఆడిన అనన్య (ఆర్యన్) తర్వాత లింగమార్పిడి చేయించుకున్నాడు. తనలో బాల్యం నుంచి ఉన్న కోరికలే మహిళగా మారేలా చేశాయని చెప్పాడు. తండ్రి బాటలోనే క్రికెట్ ను ఎంచుకున్న అనన్య.. మరి మహిళల క్రికెట్ లో ప్రాతినిధ్యం వహిస్తుందా? అనే ప్రశ్నలు వచ్చాయి.
లింగమార్పిడితో మహిళగా మారినవారు అమ్మాయిల క్రికెట్ లోకి వస్తే అదొక పెద్ద వివాదంగా మారుతుంది. శారీరకంగా మిగతా మహిళల కంటే బలంగా ఉండడంతో ఆటలో అది అసమతుల్యతకు దారితీస్తుంది. ఇప్పుడు అనన్య.. మహిళల క్రికెట్ లోకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే దుమారమే.
ఇప్పటికైతే బీసీసీఐ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అనన్య విషయంలో బోర్డు తీసుకునే నిర్ణయం ముందుముందు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పొచ్చు.
ఇటీవల తనను కొందరు క్రికెటర్లు లైంగికంగా వేధించారని.. ప్రైవేటు పార్ట్ ల ఫొటోలు ఫొటోలు పంపాలని అడిగారని.. అనన్య బంగర్ ఆరోపించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
