Begin typing your search above and press return to search.

కింగ్ కోహ్లీ మెల్‌బోర్న్ క్లాస్.. ఏబీడీ రూమ్‌లో వేసిన డాన్స్ గుర్తుందిగా!

ప్రపంచ క్రికెట్‌లో ఒక బలమైన పోటీ ఉంది.. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే 11 మంది ఆటగాళ్లు ఆడతారు.. కానీ చివర్లో విరాట్ కోహ్లీ మాత్రమే గెలిపిస్తాడు.

By:  A.N.Kumar   |   11 Jun 2026 5:00 PM IST
కింగ్ కోహ్లీ మెల్‌బోర్న్ క్లాస్.. ఏబీడీ రూమ్‌లో వేసిన డాన్స్ గుర్తుందిగా!
X

ప్రపంచ క్రికెట్‌లో ఒక బలమైన పోటీ ఉంది.. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే 11 మంది ఆటగాళ్లు ఆడతారు.. కానీ చివర్లో విరాట్ కోహ్లీ మాత్రమే గెలిపిస్తాడు. రన్ మెషిన్, ఛేజింగ్ మాస్టర్ అని ఊరికే అనరు కదా.. అయితే కోహ్లీ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ల గురించి మనం మాట్లాడుకుంటే సరిపోతుంది కానీ సడన్‌గా సౌతాఫ్రికా లెజెండ్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఎందుకు లైన్‌లోకి వచ్చాడనేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నాం.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏబీడీకి ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. "బాస్.. నువ్వు నీ లైఫ్‌లో చూసిన బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ ఏది?" అని. దానికి డివిలియర్స్ ఏమాత్రం ఆలోచించకుండా కళ్లల్లో ఆనందం దాచుకోలేక.. "2022 టీ20 వరల్డ్ కప్‌లో మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన 82 నాటౌట్ ఇన్నింగ్స్" అని తేల్చేశాడు. నిజానికి ఆ మ్యాచ్ చూసిన ఎవరికైనా హార్ట్ ఎటాక్ రానంత పనే అయింది. కానీ మన ఏబీడీ మాత్రం ఆ మ్యాచ్ చూస్తూ ఇంట్లో ఏకంగా డాన్స్ చేశాడట..

హారిస్ రౌఫ్ గుండెల్లో రైళ్లు.. డివిలియర్స్ రూమ్‌లో డాన్సులు

ఆ మ్యాచ్ గుర్తుందిగా భారత్ స్కోరు 31 పరుగులకే 4 వికెట్లు. టీవీలు బంద్ చేసి "ఈ మ్యాచ్ అయిపోయింది.. పడుకోండి" అనుకున్న టైమ్ అది. కానీ కోహ్లీ క్రీజులో ఉన్నంతవరకు పాకిస్థాన్ గెలవడం ఇంపాజిబుల్ అని వాళ్లకు కూడా తెలుసు. డివిలియర్స్ ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. "ఆ మ్యాచ్‌లో ప్రెజర్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలుసు. ల్యాండ్‌మార్క్ లాంటి ఎంసీజీ గ్రౌండ్.. లక్షలాది మంది ఫ్యాన్స్. కానీ కోహ్లీ మైండ్‌లో మాత్రం ఏదో నెక్స్ట్ లెవెల్ ప్లాన్ నడుస్తోంది. ముఖ్యంగా హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో ఆ లాంగ్-ఆన్ మీదుగా కొట్టిన బ్యాక్-ఫుట్ సిక్స్ ఉంది చూశారా.. బాబోయ్.. అది హ్యూమన్లీ ఇంపాజిబుల్ షాట్. ఆ షాట్ పడ్డాకే నాకు నమ్మకం వచ్చింది.. ఈ మ్యాచ్ మనోడు లాగేస్తున్నాడని" అని తెలిపారు. ఒత్తిడిని బిర్యానీలో నంజుకు తినే అలవాటున్న కోహ్లీ ఆ మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించాడు. ఏబీడీ దృష్టిలో స్టేజ్, అపోజిషన్, ప్రెజర్.. ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తే టీ20 హిస్టరీలోనే అది నెంబర్-1 ఇన్నింగ్స్.

ఆర్సీబీ సెంటిమెంట్.. కప్పు రాకపోయినా లవ్ తగ్గదు

ఇక కోహ్లీ, డివిలియర్స్ మధ్య ఉన్న ఆర్సీబీ 'బ్రోమాన్స్' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐపీఎల్‌లో ఇద్దరూ కలిసి ప్రత్యర్థులను ఊచకోత కోశారు. అయితే ఇక్కడో చిన్న సెటైర్ ఏంటంటే.. వీళ్లిద్దరూ కలిసి బెంగళూరుకు ఒక్క కప్పు కూడా అందించలేకపోయారు ఈ బాధ ఆర్సీబీ ఫ్యాన్స్‌ని అడిగితే చెప్తారు.. ఈ విషయంపై కూడా డివిలియర్స్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. "మేము ఆడేటప్పుడు కప్పు గెలిచి ఉంటే ఆ కిక్కే వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆర్సీబీ మ్యాచులు గెలుస్తుంటే నా సొంత టీమ్ గెలిచినంత హ్యాపీగా ఉంది" అంటూ కవర్ చేశాడు. కప్పు రాకపోయినా ఈ ఇద్దరి బంధానికి.. ఆర్సీబీపై ఉన్న ప్రేమకు ఎలాంటి డోకా లేదు.

పాకిస్థాన్ బౌలర్లకు ఇప్పటికీ రాత్రి పూట మెల్‌బోర్న్ గుర్తొస్తే చెమటలు పడతాయో లేదో తెలీదు కానీ ఏబీ డివిలియర్స్ లాంటి 360 డిగ్రీల ప్లేయర్ చేత "ఇదే బెస్ట్ ఇన్నింగ్స్" అనిపించుకోవడం మాత్రం ఒక్క కింగ్ కోహ్లీకే సాధ్యమైంది. లీగ్‌లు మారినా రిటైర్మెంట్లు వచ్చినా.. ఈ ఇద్దరి ఫ్రెండ్‌షిప్, క్రికెట్ క్లాస్ ఎప్పటికీ అన్‌బీటబుల్..