Begin typing your search above and press return to search.

ప్రీలాంచ్ పేరుతో మోసం.. హైదరాబాద్ రియల్టర్ అరెస్టు!

ఊరించే ఆఫర్ కళ్ల ముందు పెట్టి క్యాష్ తీసుకునే ఈ వైనంలో కొందరు తప్పించి.. ఎక్కువ మంది ఇబ్బందులకు గురవుతుంటారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 5:30 AM GMT
ప్రీలాంచ్ పేరుతో మోసం.. హైదరాబాద్ రియల్టర్ అరెస్టు!
X

ప్రాజెక్టు ఏదైనా ప్రీలాంచ్ పేరుతో కారుచౌక రేట్లకు యూనిట్లను అమ్మటం తెలిసిందే. క్యాష్ దండిగా ఉండి.. లెక్కల్లో పెద్దగా చూపించే అవసరం లేనోళ్లంతా ఈ ప్రీలాంచ్ లో కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అదే సమయంలో డబ్బులు పెద్దగా లేకున్నా.. భారం తగ్గుతుందని.. తక్కువ ధరకే సొంతింటిని సొంతం చేసుకుంటామన్న ఆశతో కొందరు మధ్యతరగతి వారు ప్రీలాంచ్ వైపు మొగ్గు చూపుతుంటారు. ప్రీలాంచ్ లో డీల్ కు సంబంధించి క్యాష్ మొత్తాన్ని ఏకకాలంలో కట్టేయాల్సి ఉంటుంది.

ఊరించే ఆఫర్ కళ్ల ముందు పెట్టి క్యాష్ తీసుకునే ఈ వైనంలో కొందరు తప్పించి.. ఎక్కువ మంది ఇబ్బందులకు గురవుతుంటారు. తాజాగా అలాంటి మోసానికి గురైన వైనం హైదరాబాద్ సీసీఎస్ పరిధిలో నమోదైంది. దీనిపై స్పందించిన పోలీసులు సీరియస్ యాక్షన్ చేపట్టారు. ప్రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ అధినేతను అరెస్టుచేశారు.

భువనతేజ పేరుతో రియల్ ఎస్టేట్ యజమానిని తాజాగా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేవారు. ప్రీలాంచ్ పేరుతో రూ.2.29 కోట్లు వసూలు చేసిన సంస్థ యజమాని సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. పలువురి వద్ద అతడు రూ.2.29 కోట్ల మొత్తాన్ని వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. శామీర్ పేట హ్యాపీ హోమ్స్ పేరుతో ప్లాట్లు అమ్ముతున్నట్లుగా గుర్తించారు.

బాధితుల నుంచి సేల్ డీడ్ ల రూపంలో క్యాష్ వసూలు చేసిన అతడి కారణంగా దాదాపు 400 మంది వరకు బాధితులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. తాజాగా సీసీఎస్ పోలీసులు అతడ్ని అరెస్టుచేసి రిమాండ్ కు పంపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రియల్ ఎస్టేట్ మోసాలపై కఠినంగా వ్యవహరించటమేకాదు.. గతానికి భిన్నంగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల్ని జారీ చేయటం తెలిసిందే.