Begin typing your search above and press return to search.

భూమిపైనే అత్యంత ఖరీదైన ఇళ్లు... టాప్ 10 లిస్ట్ ఇదే!

లండన్ లోని బకింగ్‌ హామ్ ప్యాలెస్ ను ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా చెబుతారు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 3:30 PM GMT
భూమిపైనే అత్యంత ఖరీదైన  ఇళ్లు... టాప్ 10 లిస్ట్  ఇదే!
X

ఇల్లు చాలా మందికి సౌకర్యం, భద్రతకు సంబంధించినది. కానీ ధనిక వర్గానికి.. ఇది సౌకర్యం, భద్రత కంటే ఎక్కువ. ఇది వారి సోషల్ స్టేటస్ ని తెలియజేయడంతోపాటు, లగ్జరీ, మంచి జీవనం కోసం అని గుర్తించాలి. ఈ క్రమంలో... ప్రపంచంలోని మిలియనీర్లు, బిలియనీర్లు తమ డబ్బును ఖర్చు చేయడానికో, తమ స్టేటస్ ను చూపించడానికో వివిధ మార్గాలను ఎంచుకుంటారు.. అందులో విలాసవంతమైన గృహాల నిర్మాణం ఒకటి.

ఇందులో భాగంగా కెన్ గ్రిఫిన్ భారీ ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. అవును... అమెరికన్ బిలియనీర్, హెడ్జ్ ఫండ్ మేనేజర్ కెన్ గ్రిఫిన్ భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ భూమిపైనే అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మించబోతున్నారు. ఫ్లోరిడా బీచ్ కు సమీపంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని ఫిక్సయ్యరు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 55 ఏళ్ల గ్రిఫిన్.. ఈ మెగా-ఎస్టేట్‌ ను నిర్మించడం కోసం తొలుత $150 నుండి $400 మిలియన్ల మధ్య ఖర్చు చేయాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టినప్పటికీ... ఇది పూర్తయ్యేనాటికి $1 బిలియన్ (రూ.8310 కోట్లు) విలువైనదిగా అంచనా వేయబడుతుంది.

గతకొన్ని సంవత్సరాలుగా సుమారు 27 ఎకరాల బీచ్ ఫ్రంట్ రియల్ ఎస్టేట్‌ ను గ్రిఫిన్ సమీకరించాడు. ఇందులో ఇంట్రాకోస్టల్ వాటర్‌ వేలో రెండు పార్సెల్‌ లు ఉన్నాయి. ఈ భారీ ఆస్తి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్-ఎ-లాగోకు దక్షిణాన కేవలం పావు మైలు దూరంలో ఉండటం గమనార్హం. దీంతో దీన్ని "బిలియనీర్స్ రో" అని పిలుస్తుంటారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్ 10 ఇల్లు:

లండన్ లోని బకింగ్‌ హామ్ ప్యాలెస్ ను ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా చెబుతారు. దీనిలో 775 గదులు, 78 స్నానపు గదులు, 92 కార్యాలయాలు ఉన్నాయి. బ్రిటిష్ రాజవంశీకులు యునైటెడ్ కింగ్‌ డం అంతటా వివిధ కోటలు, రాజభవనాలను కలిగి ఉన్నప్పటికీ, ఇది 1837 నుండి బ్రిటిష్ రాచరికానికి చిహ్నంగా ఉంది.

ముంబైలో అంబానీకి చెందిన యాంటిలియా టవర్ అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా చెబుతారు. 27 అంతస్తుల ఎత్తు ఉన్న ఈ భవనంలో 6 అంతస్తుల కార్ గ్యారేజ్, స్పా, వెల్‌ నెస్ సెంటర్, ఇండోర్ పూల్స్, సినిమా థియేటర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

బ్రెజిల్‌ లోని అత్యంత సంపన్న కుటుంబం, ప్రపంచంలోని ప్రముఖ బ్యాంకర్లు అయిన సఫ్రా కుటుంబానికి చెందిన లిల్లీ సఫ్రా ఇళ్లు విల్లా లియోపోల్డా కూడా టాప్ 10 ఇళ్లలో స్థానం దక్కించుకుంది. సుమారు 50 ఎకరాల స్థలంలో 11 బెడ్ రూం లు, 14 బాత్‌ రూం లు కలిగి ఉంది.

ఇక లండన్ లోని వింటేన్ హర్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఇళ్లలో ఒకటి. ఇది 20వ శతాబ్దం సుమారు 90,000 చదరపు అడుగుల ప్రారంభంలో రూపొందించబడింది. ఈ ఎస్టేట్ ను పార్క్‌ ఫీల్డ్ అని పిలుస్తారు. 2008 నుండి ఇది రష్యన్ బిలియనీర్‌ ఆధీనంలో ఉంది.

1830లో బెల్జియం రాజు కోసం రూపొందించబడిన సాంప్రదాయ రాజ శైలిలో ఉండే విల్లా లెస్ సెడ్రెస్ మరో అత్యంత ఖరీదైన ఇళ్లు. అందమైన కళాఖండాలు, దైవిక పురాతన ఫర్నిచర్, అధునాతన పరుపులను ఇందులో చూడవచ్చు. దీని అనంతరం... న్యూయార్క్ లోని ఫెయిర్ ఫీల్డ్ మాన్షన్ టాప్ 10 ఇళ్లల్లో ఒకటిగా నిలిచింది.

సుమారు 63 ఎకరాల ఎస్టేట్ లో ఉండే ఈ ఇల్లు... అమెరికాలోనే అత్యంత ఖరీదైనదిగా పేరు గడించింది. ఇందులో 29 బెడ్ రూం లు, 35 బాత్ రూం లు, 3 డైనింగ్ రూం లు, 3 స్విమ్మింగ్ పూల్స్ తోపాటు ఒక ప్రైవేట్ థియేటర్ ఉన్నాయి. ఇదే సమయంలో ఇక్కడ నిరంతర విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి ఆన్‌ సైట్ పవర్ ప్లాంట్‌ కూడా ఉంది.

నెక్స్ట్ ఈ రోలో లండన్ కెన్సింగ్టన్ ప్యాలెస్, 18-19 ఉంది! భారతీయ సంతతికి చెందిన ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలో ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా ఉంది. అతను ఒకటి మాత్రమే కాకుండా 3 ప్రత్యేక గృహాలను 9ఏ, 18-19 కలిగి ఉన్నాడు. వాస్తవానికి ఈ ఇల్లు 1845లో రూపొందించబడినప్పటికీ... మిట్టల్ దానిని "తాజ్ మిట్టల్"గా పునర్నిర్మించాడు.

ఇక తర్వాతి స్థానంలో... ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, అత్యంత సంపన్నమైన రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులలో ఒకరైన లారీ ఎల్లిసన్ కు చెందిన కాలిఫోర్నియాలోని ఎల్లిసన్ ఎస్టేట్ నిలిచింది. ఈ జపనీస్ శైలి ఇంటిని నిర్మించడానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది. ఇందులో 3 కాటేజీలు, వ్యాయామశాల, ఐదు ఎకరాల మానవ నిర్మిత సరస్సు కూడా ఉంది.

ఇక బెవర్లీ హిల్స్ దేశంలోని అత్యంత ఖరీదైన గృహాలలో పాలాజ్జో డి అమోర్ నిలిచింది. ఇది సుమారు 53,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 12 బెడ్‌ రూంలు, 23 బాత్‌ రూంలు, టెన్నిస్ కోర్ట్‌ లు, భారీ వాటర్‌ ఫాల్ స్విమ్మింగ్ పూల్, 27 కార్ల గ్యారేజ్, ఒక ప్రైవేట్ సినిమా హాల్, బాల్‌ రూం ఉంది.