Begin typing your search above and press return to search.

భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సైజు ఎంత భారీ అంటే?

తాజా రిపోర్టులో పేర్కొన్న అంశాల ప్రకారం 2015 నుంచి దేశంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ 73 శాతం వ్రద్ధి చెందిన ప్రస్తుతం 482 బిలియన్ డాలర్లు

By:  Tupaki Desk   |   13 April 2024 3:52 AM GMT
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సైజు ఎంత భారీ అంటే?
X

భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సైజు ఎంత భారీగా తయారైందన్న అంశానికి సంబంధించి తాజాగా విడుదలైన ఒక రిపోర్టు విడుదలైంది. అందరిని ఆకర్షిస్తున్న ఈ రిపోర్టును భారతీయ పరిశ్రమల సమాఖ్యతో పాటు.. నైట్ ఫ్రాంక్ ఉమ్మడిగా ఇండియా రియల్ ఎస్టేట్.. ఎ డికేడ్ ఫ్రమ్ నౌ పేరుతో విడుదల చేశారు. తాజా రిపోర్టులో పేర్కొన్న అంశాల ప్రకారం 2015 నుంచి దేశంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ 73 శాతం వ్రద్ధి చెందిన ప్రస్తుతం 482 బిలియన్ డాలర్లు(మన రూపాయిల్లో చెప్పుకోవాలంటే దగ్గర దగ్గర రూ.40.48 లక్షలకోట్లు)గా పేర్కొంది.

రానున్న పదేళ్ల కాలంలో ఇది కాస్తా 1487 బిలియన్ డాలర్ల సైజుకు చేరుకుంటుందని అంచనా వేసింది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.123.4 లక్షల కోట్లుగా ఉంటుందని తేల్చింది. 2015లో 279 బిలియన్ డాలర్లు (మన రూపాయిల్లో రూ.23.5 లక్షల కోట్లు)గా ఉండగా పదేళ్ల కాలంలో రూ.40 లక్షల కోట్లకు చేరుకోవటం గమనార్హం.

రానున్న పదేళ్లలో అంతకు మూడు రెట్లకు పైనే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భారతీయ స్థిరాస్తి రంగం దాదాపు 250 అనుబంధ పరిశ్రమలతో కలిసి పని చేస్తున్నట్లుగా ఈ రిపోర్టు వెల్లడించింది.

దేశీయంగా వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో స్థిరాస్తి రంగం ఒకటిగా పేర్కొంది. ఉపాధి కల్పనలో స్థిరాస్తి రంగం వాటా 18 శాతమని పేర్కొంది. మొత్తం ఆర్థిక వ్యవస్థలో దీని వాటా 7.3 శాతం కాగా.. 2034 నాటికి ఇది కాస్తా రెండు అంకెలకు (10.5శాతం) చేరుతుందని అంచనా వేస్తున్నారు. స్థిరాస్తి మార్కెట్ ఇంత భారీగా పెరగటానికి కారణం ఇళ్లకు.. ఆఫీసులకు.. ఓపెన్ ల్యాండ్లకు గిరాకీ పెరగటంగా చెబుతున్నారు. విస్తరిస్తున్న అతిథ్య.. రిటైల్ రంగాలు కూడా కారణమని స్పష్టం చేసింది.

వచ్చే పదేళ్లకు ఇళ్ల మార్కెట్ విలువ రూ.75.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని.. ఆఫీస్ స్పేస్ రంగం రూ.10.38 లక్ష్ల కోట్లకు చేరుకుంటుందన్న అంచనా వేశారు. ఆదాయంలో పెరుగుదల.. వినియోగదారులు ఖర్చు చేసే సామర్థ్యం పెరగటంతో పాటు మౌలిక వసతుల డెవలప్ మెంట్ తో పాటు.. భారత్ లో తయారీ వంటివి ఈ రంగంలో డెవలప్ కావటానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.