Begin typing your search above and press return to search.

అమెజాన్‌ కో ఫౌండర్‌ కొత్త ఎస్టేట్ ధర తెలిస్తే షాకే!

ఈ క్రమంలో తాజాగా అమెజాన్‌ కో ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ మరోసారి ఆ కోవలోకి చేరిపోయారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా లగ్జరీ ఎస్టేట్ కొనుగోలుకు ఫిక్సయ్యారు!

By:  Tupaki Desk   |   11 Aug 2023 5:03 PM GMT
అమెజాన్‌  కో ఫౌండర్‌  కొత్త ఎస్టేట్  ధర తెలిస్తే షాకే!
X

ప్రపంచ కుబేరులు, బడా వ్యాపారవేత్తలు తమకు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండేలాగా ఎస్టేట్స్ ను, లగ్జరీ విల్లాలను, ద్వీపాలను కొనుగోలు చేస్తుంటారనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా అమెజాన్‌ కో ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ మరోసారి ఆ కోవలోకి చేరిపోయారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా లగ్జరీ ఎస్టేట్ కొనుగోలుకు ఫిక్సయ్యారు!

అవును... అమెజాన్‌ కో ఫౌండర్‌ జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇప్పటికే భారీ ఆస్తులను సొంతం చేసుకున్న బెజోస్‌... ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ఇండియన్ క్రీక్ ఐలాండ్‌ లో దాదాపు 68 మిలియన్ల డాలర్ల (రూ.560 కోట్ల) విలువైన ఎస్టేట్‌ ను కొనుగోలుకు అంగీకరించినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.

రికార్డుల ప్రకారం దాదాపు 9,300 చదరపు అడుగుల (864 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉంది. ఇదే సమయంలో 1965లో నిర్మించిన 2.8 ఎకరాల్లో మూడు పడకగదుల ప్రాపర్టీ ఎంటీఎం స్టార్ ఇంటర్నేషనల్ పేరుతో ఉన్నట్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని ఇతర కొనుగోళ్లపై కూడా జెఫ్‌ బెజోస్‌ దృష్టి పెట్టారని అంటున్నారు.

అయితే ప్రస్తుతం కొనుగోలు చేసిన స్పెషల్‌ ఇండియన్ క్రీక్‌ ను "బిలియనీర్ బంకర్" అని తెలుస్తోంది. బెజోస్‌ తోపాటు, కార్ల్ ఇకాన్, టామ్ బ్రాడీ, జారెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్ లాంటి టాప్‌ సెలబ్రిటీలకు కూడా ఇక్కడ ఇళ్లు ఉండట విశేషం.

ఇటీవల గర్ల్‌ ఫ్రెండ్‌ లారెన్ శాంచెజ్‌ తో సందడి చేసిన జెఫ్‌ బెజోస్‌... తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి ఫ్లోరిడాలోని వాటర్ ఫ్రంట్ మాన్షన్‌ ను జోడించడం బిజినెస్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా నిలిచింది. ఈ సమయంలో ఈ ఎస్టేట్ తన ప్రియురాలి కోసం అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!

అయితే 2021లో అమెజాన్‌ సీఈవోగా వైదొలగిన బెజెస్‌ కు భార్య మెకెంజీ స్కాట్‌ తో విడాకుల తరువాత సూపర్‌ లగ్జరీ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడంపై మోజు పెరిగిందని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సూపర్‌ యాచ్‌ కోరును ఆయన విడాకుల అనంతరమే కొనుగోలు చేశారు.

అయితే బ్లూమ్‌ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 163 బిలియన్ల డాలర్ల సంపదతో.. ఈ ఐలాండ్‌ ఎస్టేట్‌ లో అత్యంత సంపన్న నివాసిగా జెఫ్‌ బెజోస్‌ నిలుస్తాడు. ఈ ద్వీపంలో కేవలం 40 నివాసాలు, ఒక కంట్రీ క్లబ్ తోపాటు సొంత పోలీసు విభాగం ఉన్నాయి!

కాగా... బెజోస్‌ కు ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో 165 మిలియన్ల డాలర్ల విలువైన తొమ్మిది ఎకరాల బెవర్లీ హిల్స్ మాన్షన్, మౌయ్‌ లోని ఒక ఎస్టేట్‌ తో సహా పలు లగ్జరీ భవనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... మాన్‌ హాటన్, సీటెల్‌ లో ఖరీదైన ఆస్తులు, టెక్సాస్‌ లో వేళ ఎకరాల భూమి ఉంది.