Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్టర్ ఇంటిని కూలగొట్టి వేలం వేస్తే రూ.200కోట్లు పలికింది

అమెరికాలోని ఫ్లోరిడాలోని మయామి బీచ్ ఒడ్డున ఉందీ ఓపెన్ ప్లాట్. గతంలో అందులో ఒక భవనం ఉండేది. అందులో ఒక పేరుమోసిన గ్యాంగ్ స్టర్ నివసించేవాడు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 6:30 AM GMT
గ్యాంగ్ స్టర్ ఇంటిని కూలగొట్టి వేలం వేస్తే రూ.200కోట్లు పలికింది
X

అవును.. అదో ఓపెన ప్లాట్. తాజాగా జరిగిన వేలం ప్రపంచంలోని పలువురి చూపు పడేలా చేసింది. ఎందుకంటే దాని విస్తీర్ణం 30వేల చదరపు అడుగులు మాత్రమే. బీచ్ కు అనుకొని ఉన్న ఆ ఓపెన్ ప్లాట్ ను సొంతం చేసుకోవటం కోసం రూ.200 కోట్లు (డాలర్లలో చెప్పాలంటే 23.9 మిలియన్లు) ఖర్చు ముందుకు రావటం సంచలనంగా మారింది. ఇంతకూ ఎందుకంత క్రేజ్. దాన్ని సొంతం చేసుకోవటానికి అన్ని కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? అన్నప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడు వచ్చే సమాధానం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఇంతకూ అదెక్కడ ఉంది? దాని విశేషాలేమిటన్నది చూస్తే..

అమెరికాలోని ఫ్లోరిడాలోని మయామి బీచ్ ఒడ్డున ఉందీ ఓపెన్ ప్లాట్. గతంలో అందులో ఒక భవనం ఉండేది. అందులో ఒక పేరుమోసిన గ్యాంగ్ స్టర్ నివసించేవాడు. అతడి పేరు ఏఐ క్యాప్ వన్. ఆ ప్రాంతంలో అతడు సుపరిచితుడు. అతడు మరణించిన తర్వాత ఆ ఆస్తి వివాదాస్పదంగా మారింది. దీంతో దాన్ని నేలమట్టం చేశారు. తాజాగా దానికి వేలం వేయగా భారీ ధర పలికింది.

ఈ డీల్ పై న్యూయార్క్ పోస్టు ఒక కథనాన్ని ప్రచురించింది. గ్యాంగ్ స్టర్ నివాసం ఉన్న ప్రదేశం కావటంతో అమెరికా వ్యాప్తంగా ఈ ప్రదేశానికి ఒక గుర్తింపు ఉందని.. అందులోకి పాత భవనాన్ని కూల్చేసిన నేపథ్యంలో ఓపెన్ ప్లాట్ లో నచ్చిన రీతిలో భవనాన్ని కట్టుకునే వీలుందంటున్నారు. ఈ కారణం చేతనే ఇంత భారీ ధర పలికినట్లుగా చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే రెండేళ్ల క్రితం అంటే 2021లో దీని ధర 10.75 మిలియన్లు పలికితే.. స్వల్ప వ్యవధిలోనే అది కాస్తా 23.9 మిలియన్ డాలర్లు పలకటం గమనార్హం. ఈ వేలాన్ని డగ్లాస్ ఎలిమన్ రియల్ ఎస్టేట్ సంస్థ అమ్మకానికి పెట్టింది. అయితే.. దీన్ని సొంతం చేసుకున్న వివరాలు బయటకు రాలేదు. ఏమైనా ఈ రియల్ డీల్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తూ.. హాట్ టాపిక్ గా మారింది.