Begin typing your search above and press return to search.

2036 నాటికి కొత్త ఇళ్ల గిరాకీ ఏ స్థాయిలో ఉంటుందంటే...?

అవును... 2036 నాటికి కొత్త ఇళ్ల అవసరం ఏస్థాయిలో ఉండబోతుందనే విషయంలో తాజాగా క్రెడాయ్‌-లియాసెస్‌ ఫోరాస్‌ ఒక విషయాన్ని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 11:30 AM GMT
2036 నాటికి కొత్త ఇళ్ల గిరాకీ  ఏ స్థాయిలో ఉంటుందంటే...?
X

సొంతిళ్లు అనేది ఎవరిస్థాయిలో వారికి ఒక అద్భుతమైన కళ. ఎవరి స్థాయిలో వారు జీవితకాలంలో ఒక సొంతింటిని నిర్మించుకోవాలనే చూస్తారు. ఇదే సమయలో పెరుగుతున్న జనాభా కారణంగా పంటపొలాలు, బీడు భూములు సైతం ఇళ్లస్థాలాలుగా మారిపోతున్న రోజులివి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వాటి వాటి నిర్మాణాలను విస్తరించుకుంటూ పోతున్నాయి.

ఇదే సమయంలో మారుతున్న జీవనప్రమాణాలకు అనుగుణంగా ప్రజల అభిరుచులు మారుతున్నాయి. దాంతో కొత్త కొత్త ఇళ్ల నిర్మాణానికి మరింత డిమాండ్‌ పెరుగుతోంది. ఈ విషయంలో మెట్రోపాలిటన్ నగరాలు, ప్రధాన నగరాలు అనే తారతమ్యాలేమీ లేవు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సైతం రియల్ ఎస్టేట్ వృద్ధి చెందుతూనే ఉంది. ఈ సమయంలో 2036 నాటికి కొత్త ఇళ్ల అవసరం ఎలా ఉండబోతుందనే విషయం తెరపైకి వచ్చింది. .

అవును... 2036 నాటికి కొత్త ఇళ్ల అవసరం ఏస్థాయిలో ఉండబోతుందనే విషయంలో తాజాగా క్రెడాయ్‌-లియాసెస్‌ ఫోరాస్‌ ఒక విషయాన్ని వెల్లడించింది.. ఇందులో భాగంగా 2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని వారణాసిలో జరిగిన న్యూ ఇండియా సదస్సులో ఒక నివేదికను విడుదల చేసింది. ఇదే సమయంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడించింది.

ఇందులో భాగంగా... 2018 నాటికే జనాభా అవసరాలకు తగిన స్థాయిలో ఇళ్ల నిర్మాణం జరగలేదని చెబుతున్న నివేదిక.. అప్పటికే 2.9 కోట్ల ఇళ్ల కొరత ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల గృహాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే 2023లో ఇళ్లకు అధిక గిరాకీ ఏర్పడిందని నివేదిక తెలిపింది.

ఈ సందర్భంగా క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ మాట్లాడగా... దేశంలో పెరుగుతున్న జనాభా వల్ల కొత్త ఇళ్లకు గిరాకీ, సరఫరా వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పెద్ద గృహాలకు కూడా భారీగా డిమాండ్‌ పెరిగినట్లు చెప్పారు. ఇదే క్రమంలో... ద్వితీయ, తృతీయ శ్రేణి నగరల్లో సైతం ఈ డిమాండ్ వేగంగా విస్తరిస్తుందని వెల్లడించారు.