సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న 'భారతీయన్స్'.. ఇక డ్రాగన్ దుష్ట పన్నాగాలపై...
భారత్ అమెరికన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నారై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ 'భారతీయన్స్' చిత్రాన్ని నిర్మించారు.
By: Tupaki Desk | 15 July 2023 6:20 AM GMTభారత్ - చైనా సరిహద్దుల్లో.. మరీ ముఖ్యంగా గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై డ్రాగన్ ఆర్మీ చేసిన దాష్టీకాలను ఎండగడుతూ తెరకెక్కించిన సినిమా 'భారతీయన్స్'. 'ప్రేమించుకుందాం రా' 'ప్రేమంటే ఇదేరా' 'కలిసుందాం రా' ఈశ్వర్ చిత్రాలకు రచయిత గా.. 'సర్దుకుపోదాం రండి' 'లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలకు సహా రచయితగా పనిచేసిన దీన్ రాజ్ .. దర్శకుడిగా మారి 'భారతీయన్స్'ను తెరకెక్కించారు.
భారత్ అమెరికన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నారై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ 'భారతీయన్స్' చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ఇబ్బందులు పడిన ఈ సినిమా.. సెన్సార్ సంకెళ్లు తెంచుకుని ఎట్టకేలకు ఈ నెల 14న తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో ఆడియెన్స్ ముందుకు రానుంది.
ఈ సందర్భoగా ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన పత్రికా సమావేశంలో నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి దర్శకుడు దీన్ రాజ్ చిత్ర కథానాయకుడు నీరోజ్ పుచ్చా సంగీత దర్శకుడు సత్య కశ్యప్ పాల్గొని సినిమా విశేషాలు చెప్పారు.
నిర్మాత శంకర్ నాయుడు మాట్లాడుతూ... గత 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటూ... మన దేశం మీద ప్రేమ అభిమానంతో నిర్మించిన ఈ దేశభక్తి చిత్రానికి సెన్సార్ పరంగా ఎదురైన ఇబ్బందులు కొంచెం బాద కలిగించినా... సినిమా చూసిన వారందరూ ముక్త కంఠంతో అభినందిచడం మా కష్టాలు మర్చిపోయేలా చేసింది" అని అన్నారు.
దర్శకుడు దీన్ రాజ్ మాట్లాడుతూ... "దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలను మేళవించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది" అని అన్నారు. "భారతీయన్స్" చిత్రంతో హీరోగా పరిచయం అయ్యే అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు నీరోజ్ పుచ్చా. ఈ చిత్రానికి సంగీతం అందించినందుకు గర్వంగా ఉందన్నారు సత్య కశ్యప్.
ఇక ఈ చిత్రంలో నీరోజ్ పుచ్చా తో పాటు సోనమ్ టెండప్ సుభా రంజన్ మహేందర్ బర్కాస్ హీరోలుగా నటించారు. సమైరా సందు రాజేశ్వరి చక్రవర్తి నాంగ్యాల్ హీరోయిన్లుగా కనిపించారు.