Begin typing your search above and press return to search.

ఓటీటీల్లో నెంబర్ 1.. నెట్ ఫ్లిక్స్ విజయ రహస్యమిదేనా..?

ఇక మరోపక్క నెట్ ఫ్లిక్స్ మాక్సిమం తన సబ్ స్క్రైబర్స్ కి యాడ్ ఫ్రీ కంటెంట్ అందిస్తుంది. అంటే సినిమాను థియేటర్ లో చూసే వాళ్లకు మధ్యలో యాడ్స్ రావుకదా.. ఏదో సినిమా మొదలైనప్పుడు ఇంటర్వెల్ లో వస్తాయి.

By:  Tupaki Desk   |   28 Jun 2025 9:13 AM IST
ఓటీటీల్లో నెంబర్ 1.. నెట్ ఫ్లిక్స్ విజయ రహస్యమిదేనా..?
X

ఓటీటీల్లో నెంబర్ 1 గా కొనసాగుతుంది నెట్ ఫ్లిక్స్. దానికి గట్టి పోటీ ఇవ్వాలని ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ మిగతా ఓటీటీ సంస్థలు ఎంత ప్రయత్నించినా సరే టాప్ ప్లేస్ కి ఆమడ దూరంలో ఉంటున్నారు. నెట్ ఫ్లిక్స్ మాత్రం తన బేస్ ని పెంచుకుంటూ సూపర్ జోష్ కనబరుస్తుంది. నెట్ ఫ్లిక్స్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం అందులోని కంటెంట్. హాలీవుడ్ సినిమాలు, సీరీస్ లతో పాటు ఇండియన్ సినిమాల్లో అత్యధిక ప్రాముఖ్యత ఉన్న సినిమాలు వాళ్లే తీసుకుంటున్నారు.

ఏదైనా పాన్ ఇండియా సినిమా అంటే చాలు నెట్ ఫ్లిక్స్ ఖర్చీఫ్ వేయాల్సిందే అన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది. కేవలం భారీ బడ్జెట్ సినిమాలే కాదు కంటెంట్ ఉండి ప్రేక్షకుల మనసులు గెలిచిన సినిమాలు కూడా కనిపెట్టి నెట్ ఫ్లిక్స్ అందుకుంటుంది. కంటెంట్ విషయంలో తమ సబ్ స్క్రైబర్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది నెట్ ఫ్లిక్స్. అందుకే అది టాప్ 1 గా కొనసాగుతుందని చెప్పొచ్చు.

ఇక మరోపక్క నెట్ ఫ్లిక్స్ మాక్సిమం తన సబ్ స్క్రైబర్స్ కి యాడ్ ఫ్రీ కంటెంట్ అందిస్తుంది. అంటే సినిమాను థియేటర్ లో చూసే వాళ్లకు మధ్యలో యాడ్స్ రావుకదా.. ఏదో సినిమా మొదలైనప్పుడు ఇంటర్వెల్ లో వస్తాయి. నెట్ ఫ్లిక్స్ లో సినిమా మొదలైతే యాడ్స్ లేకుండా సినిమా చూసేయొచ్చు అనే టాక్ పడిపోయింది. ఐతే మిగతా ఓటీటీలు ఇలా యాడ్ ఫ్రీ కంటెంట్ అందించాలంటే ఎక్స్ ట్రా పే ఛార్జ్ చేస్తున్నారు. అందుకే వాళ్లకి సబ్ స్క్రైబర్స్ తగ్గుతున్నారు.

అంతేకాదు ప్రైమ్ వీడియో లో సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా కూడా కొన్ని సినిమాలు, సీరీస్ ల కోసం మళ్లీ ఎక్స్ ట్రా రెంట్ వసూలు చేస్తున్నారు. ఈరోస్ నౌ, లయన్స్ గేట్ లాంటి ప్రొడక్షన్ సినిమాలు చూడాలంటే అదనపు రుసుము చెల్లించాల్సిందే. అంతేకాదు యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం కూడా ఎక్స్ ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఇదే ప్రైమ్ వీడియోని కిందకు పడిపోయేలా చేస్తుందని చెప్పొచ్చు. ఇక జియో హాట్ స్టార్ లో యాడ్స్ టీవీలో యాడ్స్ మాదిరిగానే వస్తున్నాయి. అందులో 20 నిమిషాల కంటెంట్ చూస్తే 3, 4 సార్లు యాడ్స్ వస్తున్నాయి. వీటి వల్ల వీక్షకులకు డిస్టబెన్స్ గా ఉంటుంది. అందుకే నెట్ ఫ్లిక్స్ ని ఎక్కువ చూస్తున్నారు.

కంటెంట్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ టాప్ అనిపిస్తుండగా ఇలా ఎక్స్ ట్రా ఛార్జ్ ఇంకా యాడ్స్ లాంటివి లేకుండా చేయడం వల్ల నెట్ ఫ్లిక్స్ హవా కొనసాగుతుంది.