Begin typing your search above and press return to search.

అమెరికాలో ఐదుగురు తెలుగోళ్లు అరెస్ట్.. కారణం ఇదే

By:  Tupaki Desk   |   21 Dec 2019 4:58 AM GMT
అమెరికాలో ఐదుగురు తెలుగోళ్లు అరెస్ట్.. కారణం ఇదే
X
అమెరికాలోని తెలుగోళ్లు కొందరు చేసిన ఎదవ పనితో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. అగ్ర రాజ్యంలో తీవ్రమైన నేరంగా పరిగణించే ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్న వారిని ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి పని చేసి దాదాపుగా రూ.49.79 కోట్లు సంపాదించినట్లుగా చెబుతున్నారు.

ఇంతకూ వీరు చేసిన ఎదవ పని ఏమిటన్న వివరాల్లోకి వెళితే.. పాన్ (పోలో ఆల్టో నెట్ వర్స్క్) కంపెనీలో 42 ఏళ్ల జనార్థన్ ఐటీ ఆడ్మినిస్ట్రేటర్ గా పని చేస్తుంటారు. అతనితో పాటు కాలేజీలో చదువుకునే 41 ఏళ్ల గణపతి.. మరో ముగ్గురు స్నేహితులు శివన్నారాయణ (45).. సాబిర్ (42).. ప్రసాద్ (50)లు ఈ ముఠాకు సభ్యులుగా గుర్తించారు.

దాదాపు ఏడేళ్ల క్రితం పాన్ కంపెనీలో ఐటీ ఆడ్మినిస్ట్రేటర్ గా జనార్దన్ ఉద్యోగంలో చేరారు. కంపెనీ డేటాబేస్ నుంచి కీలకమైన సమాచారాన్ని దొంగలించి తన మిత్రులకు పంపేవాడు. ఆ కంపెనీ సెక్యురిటీలతో వ్యాపారం చేసేవారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే మరో ఉదంతంలో నలుగురు భారతీయులు మానవ అక్రమరవాణా కేసులో అధికారులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం గత ఆదివారం అమెరికా బోర్డర్ పోలీసులు మసెన్నా సమీపంలో ఒక కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న ఇద్దరు భారతీయుల్ని గుర్తించారు.

ట్యాక్సీ డ్రైవర్తో పాటు.. అందులో ఉన్న మరో భారత వ్యక్తి ఇద్దరు అమెరికా శాశ్విత పౌరులుగా గుర్తించారు. ఈ ఇద్దరే ఎలాంటి పత్రాలు లేకుండా మరో ఇద్దరు భారతీయుల్ని తీసుకొచ్చినట్లుగా గుర్తించి కేసులు నమోదు చేశారు. వీరు చేసిన తప్పునకు గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే వీలున్నట్లు చెబుతున్నారు.