Begin typing your search above and press return to search.

విమానం త‌లుపు ఊడి కింద ప‌డింది

By:  Tupaki Desk   |   20 Aug 2015 11:15 AM GMT
విమానం త‌లుపు ఊడి కింద ప‌డింది
X
సాంకేతిక లోపాల‌తో విమానం కొండ‌ల్లో..స‌ముద్రంలో కూలిపోవ‌టం.. పెద్ద ఎత్తున ప్రాణాలు పోవ‌టం తెలిసిందే. దీనికి క‌చ్ఛిత‌మైన కార‌ణాలు ఇంకా బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిసిన‌ప్పుడు మాత్రం.. విమాన‌యాన సంస్థ‌ల నిర్ల‌క్ష్య‌మే విమాన ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతుందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఊహించ‌టానికి కూడా సాధ్యం కాని విధంగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే..

అమెరికాలోని నార్త్ కెరోలిన్‌ లోని మౌంట్ హోలీ గ్రీన్ మెడోస్ గోల్ప్ కోర్టులో పొద్దున్నే గోల్ఫ్ ఆడుతున్నారు. చుట్టూ ప‌చ్చిక బ‌య‌ళ్ల‌తో క‌నువిందు చేసే వాతావ‌ర‌ణంలో ఉన్న‌ట్లుండి ఆకాశం నుంచి ఏదో జారి ప‌డిన‌ట్లుగా భావించారు. ఆ వైపుకు అక్క‌డి వారు ప‌రిగెత్తారు. అక్క‌డున్న వ‌స్తువును చూసి షాక్ తిన్నారు.

ఆకాశంలో నుంచి జారి ప‌డిన వ‌స్తువు మ‌రేదో కాదు.. విమానం తలుపు. ఆ ప్రాంతంలో ఎవ‌రూ లేక‌పోవ‌టంతో పెద్ద ముప్పు త‌ప్పింద‌ని ఊపిరి పీల్చుకున్నా.. విమానం త‌లుపు ఊడి ప‌డిపోయిన విమానం ప‌రిస్థితి ఏమిట‌న్న సందేహం అక్క‌డి వారికి క‌లిగి వెంట‌నే.. దాని స‌మాచారం అందించే ప్ర‌య‌త్నించారు.

ఇక‌.. త‌లుపు ఊడిప‌డిన విమానం సంగ‌తేమైంద‌న్న విష‌యానికి వ‌స్తే.. డల్లాస్ నుంచి చార్లొట్టెకు వెళుతున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ 321విమానంగా దాన్ని గుర్తించారు. కాసేప‌ట్లో విమానం ల్యాండ్ కానుంద‌నుకున్న స‌మ‌యంలో ప్యానెల్ డోర్ కింద‌కు ప‌డిపోయింద‌ని విమాన సిబ్బంది చెబుతున్నారు. అదృష్టం బాగుండ‌టంతో స‌ద‌రు ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. త‌లుపు ఊడిపోయిన విమానంలో మొత్తం 146 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌లుపు ఊడి కింద‌కుప‌డిపోయేలా ఉందంటే.. విమాన ప్ర‌యాణం ముందు భ‌ద్ర‌తా ప‌ర‌మైన ప‌రీక్ష‌లు ఎంత బాగా జ‌రిగాయో అన్న‌ది ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.