Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలిసారి: హైదరాబాద్ శివారులో 5జీ డేటా కాల్ టెస్టు

By:  Tupaki Desk   |   23 Feb 2022 4:37 AM GMT
దేశంలోనే తొలిసారి: హైదరాబాద్ శివారులో 5జీ డేటా కాల్ టెస్టు
X
హైదరాబాద్ మహానగర శివారులోని సంగారెడ్డిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ మరో ఘనతకు వేదికైంది. మరికొంతకాలంలో 5జీ నెట్ వర్కును దేశంలోకి తీసుకురావాలని భావిస్తున్న వేళ.. తాజాగా 5జీ టెక్నాలజీకి సంబంధించిన స్వదేశీ సాంకేతికతో చేసిన టెస్టింగ్ విజయవంతమైంది. పూర్తిస్థాయిలో స్వదేశీ టెక్నాలజీతో 5జీ వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీని వైసిగ్ నెట్ వర్కు అనే స్టార్టప్ కంపెనీతో కలిసి ఐఐటీ హైదరాబాద్ షేర్ చేసుకుంది.

దేశీయంగా డెవలప్ చేసిన 5జీ ఒరాన్ టెక్నాలజీ సాయంతో తొలిసారి డేటా కాల్ ను పరీక్షించారు. 5జీ లోకల్ టెక్నాలజీలో ఇదో కీలక ముందు అడుగుగా అభివర్ణిస్తున్నారు. తమ పరిశోధనలు 5జీతో పాటు.. ఫ్యూచర్ టెక్నాలజీల్ని డెవలప్ చేసేందుకు ఉపయోగపడుతుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి చెబుతున్నారు. 5జీ రంగంలో తాము డెవలప్ చేసిన టెక్నాలజీ దేశాన్ని ఆత్మనిర్భర్ గా మారుస్తుందన్న భావనను వ్యక్తం చేశారు.

పూర్తి స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసిన 5జీ డేటా కాల్ ను 3.3-3.5 గిగాహెర్ట్ జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో 100 మెగా హెర్టెజ్ సపోర్టు చేసే మల్టిపుల్ ఇన్ ఫుట్ - మల్టిపుల్ అవుట్ పుట్ సామర్థ్యం ఉన్న బేస్ స్టేషన్ ను ఉపయోగించి డేటా కాల్ ను డెవలప్ చేశారని చెబుతున్నారు.

ఈ టెక్నాలజీని దేశీయంగా వైర్ లెస్ పరికరాల్ని తయారీ చేసే వారికి అందుబాటులో ఉంచుతున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా 5జీ టెక్నాలజీకి సంబంధించి స్వదేశీ సాంకేతికత సత్తా ఎంతన్న తాజా పరీక్షతో వెల్లడైందని చెప్పక తప్పదు.