Begin typing your search above and press return to search.

ఈ డ్రగ్ తో కరోనాకు చెక్..క్లినికల్ ట్రయల్స్ సక్సెస్

By:  Tupaki Desk   |   5 May 2020 12:02 PM GMT
ఈ డ్రగ్ తో కరోనాకు చెక్..క్లినికల్ ట్రయల్స్ సక్సెస్
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. దేశ కంపెనీలు సైతం ఈ కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా గుజరాత్ ప్రధాన కేంద్రంగా అంతర్జాతీయ స్తాయిలో పనిచేస్తున్న ఫార్మా టాప్ కంపెనీ ‘జైడస్ క్యాడిలా’ సంచలన ప్రకటన చేసింది. తాము తయారు చేసిన మెడిసిన్ కరోనా వైరస్ సోకిన పేషంట్లపై అద్భుతంగా పనిచేస్తోందని.. కరోనా చికిత్సకు మందు కనిపెట్టామని ప్రకటించారు. ఈ మందు ప్రయోగించడానికి క్లినికల్ ట్రయల్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపింది. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రాగానే కరోనా క్లినికల్ ట్రయల్స్ చేస్తామని సంస్థ తెలిపింది.

హెపటైటిస్-బి, హైపటైటిస్-సి డ్రగ్ మిశ్రమాన్ని వినియోగించి కరోనా వైరస్ కోసం డ్రగ్ ను కనిపెట్టినట్టు జైడస్ క్యాడిలా తెలిపింది. ఈ రెండు మిశ్రమాలను ఆధారం చేసుకొని మరో కొత్త డ్రగ్ ను కనుగొన్నామని జైడస్ క్యాడిలా సంస్థ చెబుతోంది. ‘పెగిహెప్’ పేరుతో ఉండే ఈ మందు ద్వారా కరోనా నయం అవుతోందని తెలిపింది. ఇప్పటికే ఈ హెపటైటిస్ డ్రగ్ మిశ్రమంతోనే చైనా, క్యూబాల్లో కరోనాను నయం చేస్తున్నారని జైడస్ క్యాడిలా సంస్థ తెలిపింది.

కాగా ఈ సంస్థ ప్రతిపాదనలపై కేంద్ర డీజీసీఏ కార్యాలయం నిపుణుల కమిటీని నియమించింది. వారు ఆమోదిస్తే కరోనాకు ఈ మందును క్లినికల్ ట్రయల్స్ తర్వాత వాడవచ్చు. ఇదే జరిగితే కరోనాకు మొదట మందు కనిపెట్టిన దేశంగా భారత్ ఖ్యాతి చెందుతుంది.