Begin typing your search above and press return to search.

మరో 4 పులులు - 3 సింహాలకు కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   23 April 2020 4:30 PM GMT
మరో  4 పులులు - 3 సింహాలకు కరోనా పాజిటివ్
X
పులికి కరోనా వైరస్ వచ్చిందని ప్రచారం జరిగిన కొద్ది రోజులకే మరో నాలుగు పులులు - 3 సింహాలకు కరోనా వైరస్ సోకింది. నాలుగు సంవత్సరాల ఆడ మలయన్ పులికి వైరస్ సోకినప్పుడు ఎలా ప్రవర్తించిందో వీటికి అవే లక్షణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వాటి ముక్కు - గొంతు - శ్వాస నాళం నుంచి శాంపుల్స్ తీసి వైద్య పరీక్షలకు పంపించాం. దాంతో పాటు వాటికి మత్తు మందు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు.

న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూలోని మూడు పులులు - మూడు సింహాలు దగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే వాటికి కరోనా టెస్టులు చేశాం. ఫెకల్ శాంపుల్ తో టెస్టులు నిర్వహిస్తున్నాం. జంతువులను అనిస్తీషియాతోనే కదలకుండా ఉంచుతున్నాం. ఈ ఫెకల్ టెస్టుల్లో మరో 6 పిల్లులకు కూడా వైరస్ సోకినట్లు కూడా నిర్ధారించాం.

కాకపోతే టైగర్ మౌంటైన్ జూలో మరో ఏ ఒక్క పులి దగ్గే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని జూ అధికారులు తెలిపారు. వైరస్ లక్షణాలున్న ఎనిమిది పులులు జూలో చక్కగా ఆడుకుంటున్నాయి. మామూలుగానే ప్రవర్తిస్తున్నాయి. బాగానే తింటున్నాయి. వాటి దగ్గు కూడా దాదాపు తగ్గిపోయింది అని తెలిపారు. నొవల్ కరోనా వైరస్ ఇతర జంతువులకు సోకకుండా ముందుజాగ్రత్త కోసం పులులు, సింహాలకు పరీక్షలు చేశాం అని , పులులకు వెటర్నరీ ల్యాబరేటరీల్లో టెస్టులు చేస్తున్నాం అని , ఇప్పటికీ ఆ జంతువులకు వైరస్ ఎవరో సిబ్బంది ద్వారానే వ్యాప్తి చెందిందని అనుకుంటున్నాం అని అధికారులు తెలిపారు. జూలో ఉన్న మిగతా చిరుతపులులు ఇతర జంతువులు ఎటువంటి జబ్బుకు గురికాలేదు అని జూ అధికారులు తెలిపారు.