Begin typing your search above and press return to search.

అపరిచితుడుగా మారిపోయిన జెలెన్ స్కీ

By:  Tupaki Desk   |   1 April 2022 7:30 AM GMT
అపరిచితుడుగా మారిపోయిన జెలెన్ స్కీ
X
రష్యా యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్ స్కీ అపరిచితుడుగా మారిపోయాడా ? ఆయన వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ చట్టసభలను ఉద్దేశించి జెలెన్ స్కీ మాట్లాడుతూ యుద్ధం కీలకదశకు చేరుకుంది కాబట్టి తమను అన్నీ దేశాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నాటో దేశాలు, పాశ్చాత్య దేశాల మద్దతుపై రోజుకో విధంగా మాట్లాడుతున్నారు.

ఒకరోజు తమకు నాటో దేశాలు అన్యాయం చేశాయంటు మండిపడతారు. మరోరోజు అమెరికా నాయకత్వంలోని నాటో దేశాలను నమ్మి దెబ్బతిన్నామంటు దెప్పి పొడుస్తారు.

ఇంకో రోజు యుద్ధ విరమణకు తాము సిద్ధంగా ఉన్నామంటు ప్రకటిస్తారు. మరుసటిరోజే రష్యా ముందు ఏ విషయంలో కూడా వెనక్కు తగ్గేదేలే అంటు తొడకొడతారు. ఈ పద్ధతిలో జెలెన్ స్కీ ఏరోజు ఏమి మాట్లాడుతున్నారో కూడా ప్రపంచదేశాలకు అర్థం కావటంలేదు.

టీవీల్లో హాస్యపాత్రలు ధరించటం ద్వారా పాపులరై రాజకీయాల్లోకి వచ్చి దేశానికి అధ్యక్షుడైన జెలెన్ స్కీ కీలకమైన యుద్ధం సమయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. దీంతో జెలెన్ స్కీ వ్యవహార శైలిని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో అర్ధం కావటంలేదు. ఒకవైపు రష్యా సైన్యాల దెబ్బకు ఉక్రెయిన్లోని చాలా దేశాల ధ్వంసమైపోతున్నాయి. దాదాపు 50 లక్షల మంది ఇతర దేశాలకు వలసలు వెళ్ళిపోయారు. కొన్ని వేలమంది చనిపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా జెలెన్ స్కీ ఏదో ఒక స్టాండ్ తీసుకోకుండా అయోమయంలో కనిపిస్తున్నారు. నిజానికి ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోరు.

ఎందుకంటే యుద్ధంలో అంతిమంగా గెలుపు ఎవరిది అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే రెండు దేశాలూ నష్టపోతాయన్నది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా జెలెన్ స్కీ యుద్ధంపై స్పష్టమైన స్టాండ్ తీసుకుంటే ఇతర దేశాలకు క్లారిటీ వస్తుంది. లేకపోతే చివరకు జెలెన్ స్కీ అపరిచితుడుగానే మిగిలిపోతారు.