Begin typing your search above and press return to search.

జ‌కీర్‌ కు చావుభ‌యం చూపిన భార‌త్‌!

By:  Tupaki Desk   |   12 July 2016 4:34 AM GMT
జ‌కీర్‌ కు చావుభ‌యం చూపిన భార‌త్‌!
X
డాకాలో ఉగ్రవాద చర్యలకు పరోక్షంగా కారణమయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో ఇండియాలో పీస్ టీవి వ్యవస్థాపకుడు - మతపెద్ద జకీర్‌ నాయక్ భారత్‌ కు రావడం లేదని ఆయన ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే భార‌తీయ మీడియాతో త‌ప్ప‌కుండా మాట్లాడుతారని మెలిక పెట్టారు. జ‌కీర్‌ ఇండియాకు రారని - సౌదీ అరేబియాలోని మదీనా నుంచి స్కైప్‌ లో విలేకరులతో మాట్లాడతారని వారు ప్రకటించారు.

ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఆయన ప్రసంగాలు ఉంటున్నాయని - అనుమతిలేకుండా టీవీ ప్రసారాలు నిర్వహించారని వస్తున్న విమర్శలకు జ‌కీర్ మీడియా సమావేశంలో జవాబు చెబుతారని మొదట ఆ ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఆయన ఇండియాకు రారని - సౌదీ అరేబియాలోని మదీనా నుంచి స్కైప్‌ లో విలేకరులతో మాట్లాడతారని ఆయ‌న ప్ర‌తినిధులు తాజాగా ప్రకటించారు. ఆయన దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న భయంతో జకీర్ వెనుకడుగు వేసినట్లు భావిస్తున్నారు.

వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయిక్ ను ప్రమాదకారిగా బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అభివ‌ర్ణించారు. 21వ శతాబ్దంలో కూడా 7వ శతాబ్దం నాటి లైంగిక బానిసత్వం - బహుభార్యాత్వం వంటి విషయాలను ప్రచారం చేస్తున్నాడని ట్వీట్ లో పేర్కొన్నారు. తాను జకిర్ నాయిక్ ప్రసంగాలను విన్నాననీ, ఆయన బోధనలు అత్యంత ప్రమాదకరధోరణికి ప్రతిబింబాలని నస్రీన్ పేర్కొన్నారు. ఇదిలాఉండ‌గా శివ‌సేన సైతం జ‌కీర్‌ పై స్పందించింది. ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు - ఇస్లాం మత బోధకుడు జకీర్‌ నాయిక్‌ ముంబైలో విమానం దిగగానే అరెస్టు చేయాలని శివసేన డిమాండ్‌ చేసింది. పాకిస్తాన్‌ నివాస కేంద్రంగా ఉన్న అజ‌హార్‌ మసూద్‌ వంటివారు బహిరంగంగానే విషం చిమ్ముతారని, కానీ జకీర్‌ నాయిక్‌ వంటి వారు సామాజిక సేవ పేరుతో - శాంతిని కోరుతున్న వ్యక్తులుగా కనిపిస్తూ పరోక్షంగా జాతి వ్యతిరేకులను ప్రోత్సహిస్తుంటారని శివసేన పేర్కొంది. ఢాకా సంఘటన తరువాత జకీర్‌ నాయిక్‌ విషయం బైటికి వచ్చిందని శివసేన తన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.