Begin typing your search above and press return to search.

యూట్యూబర్ ధనశ్రీ​తో చాహల్​ పెళ్లి.. క్రికెటర్ల అభినందనలు

By:  Tupaki Desk   |   23 Dec 2020 3:10 AM GMT
యూట్యూబర్ ధనశ్రీ​తో చాహల్​ పెళ్లి.. క్రికెటర్ల అభినందనలు
X
టీఇండియా క్రికెటర్​ యజవేంద్ర చాహల్​ ధనశ్రీ అనే ఓ యూట్యూబర్​ను పెళ్లిచేసుకున్నాడు. వీళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ధనశ్రీ డ్యాన్సర్​. ఆమెకు యూట్యూబ్​లో మంచి ఫాలోయింగ్​ ఉంది. ఈ క్రమంలో లాక్​డౌన్​కు ముందే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. కరోనా టైంలో ఎంగేజ్​మెంట్ చేసుకున్నారు. నిన్న(బుధవారం) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని ఇన్​స్టా, ట్విట్టర్​లో చాహల్​ పంచుకున్నాడు.

‘మేం ఒక్కటయ్యాం. గతంలోనే మాకు పరిచయం ఏర్పడింది. మేం ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం. అందుకే పెళ్లిచేసుకున్నాం’ అంటూ చాహల్​ పోస్ట్​ పెట్టాడు. అయితే క్రికెట్​ అభిమానులు, ఆర్​సీబీ ఫ్యాన్స్​ చాహల్​కు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్స్​ చాహల్​’ అంటూ కామెంట్​ బాక్స్​ను నింపేశారు. మరోవైపు క్రిస్​గేల్​, కర్ణశర్మ, రోహిత్​శర్మ భార్య రితికా కూడా చాహల్​కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వీళ్లు పెళ్లిచేసుకున్నట్టు సమాచారం.

చాహల్​ అద్భుతమైన స్పిన్నర్​. అవసరమైనటైంలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఇరుకున పెట్టడం అతడి స్పెషాలిటి. ఆర్​సీబీ తరఫున ఆడేటప్పుడు కూడా అతడు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి విరాట్​ కోహ్లి బంతిని చాహల్ కు ఇస్తాడు. అలాగే చాహల్​ డ్రెస్సింగ్​రూమ్​లోనూ, స్టేడియంలోనూ ఎంతో ఫన్నీగా ఉంటాడు. ఎప్పుడూ జోకులేస్తూ తోటి ఆటగాళ్లను నవ్విస్తూ ఉంటాడు. ప్రత్యర్థి జట్టు క్రికెటర్లతోనూ ఎంతో ఫన్నీగా మాట్లాడటం అతడి స్పెషాలిటి. గ్రిస్​గేల్​ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం చాహల్​ను ఎంతో ఇష్టపడతారు.