Begin typing your search above and press return to search.

రిటైర్మెంట్ కు గుడ్ బై.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్న యువరాజ్

By:  Tupaki Desk   |   10 Sept 2020 9:45 AM IST
రిటైర్మెంట్ కు గుడ్ బై.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్న యువరాజ్
X
ఆట ఏదైనా కానీ ఒకసారి వీడ్కోలు పలికిన తర్వాత.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. తాజాగా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. గత జూన్ లో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన యువరాజ్.. తాజాగా తాను క్రికెట్ కు రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా పేర్కొంటూ అందరిని సర్ ప్రైజ్ చేశారు. ఇక.. తన అభిమానులకు ఏకంగా పండుగ లాంటి వార్తను ఆయన వెల్లడించారు.

పంజాబ్ క్రికెట్ ప్రయోజనాల కోసం యువరాజ్ రిటైర్మెంట్ ప్రపోజల్ ను వెనక్కి తీసుకోవాలని పంజాబ్ క్రికెట్ సంఘం కార్యదర్శి పునీత్ బాలి కోరిన నేపథ్యంలో ఆయనీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటానికి తొలుత తాను కొంత సందేహపడినట్లు చెప్పారు. అయితే.. బాలి వినతిని తాను విస్మరించలేకపోయినట్లుగా పేర్కొన్నారు.

యువరాజ్ తన తాజా నిర్ణయంతో దేశవాళీ క్రికెట్ లో ఆడనున్నట్లు చెబుతున్నారు. పంజాబ్ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని చెబుతున్నారు. తాజాగా మొహాలి స్టేడియంలో రెండుసుదీర్ఘమైన శిబిరాల్ని నిర్వహించిన యువరాజ్ పునరాగమనం అందరికి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు.

తనకు మళ్లీ ఆట మీద మనసు మళ్లిందని..యువరాజ్ తన రిటైర్మెంట్ కు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లుగా బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరభ్ గంగూలీకి లేఖ రాసినట్లు చెబుతున్నారు. మరి దీనిపై సౌరభ్ ఏ తీరులో స్పందిస్తారో చూడాలి.మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. బ్యాట్ పట్టుకొని క్రీజ్ లోకి దిగాలనుకుంటున్న యువరాజ్ నిర్ణయం ఆయన అభిమానులకు మాత్రం పెద్ద శుభవార్తే.