Begin typing your search above and press return to search.

పెరుగుతున్న యువ‌గ‌ళం టార్గెట్.. రీజ‌నేంటి..!

By:  Tupaki Desk   |   13 March 2023 6:00 AM GMT
పెరుగుతున్న యువ‌గ‌ళం టార్గెట్.. రీజ‌నేంటి..!
X
400 రోజులు.. 4 వేల కిలో మీట‌ర్లుగా నిర్ణ‌యించుకుని అడుగులు ప్రారంభించిన టీడీపీ యువ నాయ‌కుడు నారాలోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర టార్గెట్ పెరుగుతోంద‌నే భావ‌న పార్టీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. షెడ్యూల్ ప్ర‌కారం.. గ‌త నెల‌లోనే చిత్తూరులో ఈ పాద‌యాత్ర పూర్తి కావాలి. కానీ, ఇప్పటికీ పూర్తికాలేదు. ఇంకా .. ఎప్పుడు పూర్త‌వుతుందో తెలియదు. కుప్పంలో జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన ఈ యాత్ర‌కు జోష్ బాగానే ఉంది.

అయితే.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. క‌నుక పాద‌యాత్ర ముందుకు సాగ‌క‌పోతే.. ఎన్నిక‌ల షెడ్యూల్ నాటికి పూర్తికాక‌పోతే.. అర్ధంతరంగా పాద‌యాత్ర‌ను నిలుపుద‌ల చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. పైగా.. షెడ్యూల్ ప్ర‌కారం.. రోజుకు 14 నుంచి 19 కిలో మీట‌ర్ల మేర‌కు న‌డ‌వాల్సి ఉంది. కానీ .. ఇప్ప‌టి వ‌ర‌కు తొలి రెండు మూడు రోజులు మాత్ర‌మే ఈ మేర‌కు న‌డిచారు. త‌ర్వాత‌.. 10 కిలో మీట‌ర్ల‌లోపులోనే పాద‌యాత్ర ఆగిపోయింది.

అదేస‌మ‌యంలో అస‌లు పాద‌యాత్ర‌కు భూకంపం వ‌చ్చినా బ్రేక్ ఇచ్చేది లేద‌ని నారా లోకేష్ చెప్పుకొ చ్చారు. కానీ, తార‌క‌ర‌త్న మ‌ర‌ణం, శివ‌రాత్రి సంద‌ర్భంగా మూడు రోజుల పాటు విరామం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని.. 11, 12, 13 తేదీల్లోనూ పాద‌యాత్ర నిలిచిపోయింది. దీంతో పాద‌యాత్ర మ‌రో మూడు రోజులు ఆగిపోయిన‌ట్టు అయింది. దీనికితోడు.. న‌డుస్తున్న ప్రాంతాల రూట్ కూడా మారిపోతోంది.

ఎక్కువ స‌మ‌యం ముఖాముఖికి స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఇది మంచిదే అయినా.. ముందుగానే నిర్ణ‌యించుకోక‌పోవ‌డంతో టైం కిల్ అవుతోంది. దీంతో నిర్ణీత 4000 కిలో మీట‌ర్ల దూరాన్ని 400 రోజుల్లో పూర్తి చేయ‌డం అంత ఈజీకాద‌ని చెబుతున్నారు. పైగా.. ఎన్నిక‌ల స‌మ‌యానికి నిధుల స‌మ‌స్య వ‌చ్చినా రావొచ్చ‌ని అంటున్నారు. ఇక‌, అప్ప‌టికి టికెట్లు కూడా ప్ర‌క‌టించే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు. జ‌గ‌న్ చేసిన పాదయాత్ర ఎన్నిక‌ల‌కు ఖ‌చ్చితంగా మూడు మాసాల ముందు ఆగిపోయిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఎలా చూసుకున్నాయువ‌గ‌ళం పాద‌యాత్ర అనుకున్న విధంగా ముందుకు సాగ‌డం లేద‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.