Begin typing your search above and press return to search.

ఐ ఫోన్ 6ఎస్ కంటే యు యురేకా టాప్

By:  Tupaki Desk   |   17 Dec 2015 12:25 PM GMT
ఐ ఫోన్ 6ఎస్ కంటే యు యురేకా టాప్
X
ఒకప్పుడు ట్రెండు తెలుసుకోవాలంటే ఎంతో స్టడీ చేయాల్సి ఉండేది. ఇప్పుడు కూడా సంస్థలు అధ్యయనాలు చేస్తున్నా కూడా ఇంటర్నెట్ - సోషల్ మీడియా యుగంలో ట్రెండు తెలుసుకోవడం కూడా సులభమైపోయింది. గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా దేనికోసం వెతికారో తెలిస్తే చాలావరకు ట్రెండు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు వ్యాపార సంస్థలు కూడా తమ ఉత్వత్తుల కోసం గూగుల్ సెర్చ్ ను ఫాలో అవుతున్నారట.

యువత వేటిపై ఆసక్తిగా ఉన్నారు, ఏ వస్తువులకు - వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. వారు సెర్చ్‌ చేసిన అంశాలను బట్టి యువత ట్రెండు అర్థం చేసుకోగలగడం సాధ్యమవుతోంది. 2015 ఏడాది మొత్తంలో భారత్‌ లో నెటిజన్లు శోధించిన అంశాల్ని క్రోడీకరించి గూగుల్‌ జాబితాను విడుదల చేసింది. యువత ఇప్పుడు ఎక్కువగా స్మార్టుఫోన్లపై దృష్టి పెడుతుండడంతో ఈ ఏడాది యువత ఎక్కువగా ఏ మొబైల్‌ ఫోన్ల కోసం వెతికారన్నది గూగుల్ విడుదల చేసింది. యు యురేకా ఫోన్ ఆ జాబితాలో టాప్ లో నిలచింది. అది ఐఫోన్ 6 ఎస్ ను కూడా వెనక్కు నెట్టేయడం విశేషం.

టాప్ సెర్చ్ డ్ మొబైల్స్

1. యు యురేకా
2. యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌
3. లెనోవో కే3 నోట్‌
4. లెనోవో ఏ7000
5. మోటో జీ
6. మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌ సిల్వర్‌5
7. సామ్‌ సంగ్‌ గెలాక్సీ జే7
8. మోటో ఎక్స్‌ ప్లే
9. మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌ స్పార్క్‌
10. లెనోవో ఏ6000