Begin typing your search above and press return to search.

మ‌రి ఏపీ అప్పులు ష‌ర్మిలా.. అది కూడా చెప్పాలి క‌దా?!

By:  Tupaki Desk   |   21 March 2022 3:30 AM GMT
మ‌రి ఏపీ అప్పులు ష‌ర్మిలా.. అది కూడా చెప్పాలి క‌దా?!
X
రాజ‌కీయాల్లో ఉన్న వారు చేసే విమ‌ర్శ‌లు బాగానే ఉంటున్నాయి. అయితే.. వారు ఒక వైపే చూస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల నుంచే వినిపిస్తున్నాయి. రెండో వైపు కూడా చూడాలిక‌దా! అంటున్నారు. ఎందుకంటే.. కేవ‌లం ఒక రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను మాత్ర‌మే ఎత్తి చూపుతూ.. ఏదో ల‌బ్ధి పొందాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారు.. పొరుగు రాష్ట్రంలో త‌మ కుటుంబానికే చెందిన వ్య‌క్తి పాల‌న చేస్తున్న రాష్ట్రంలోనూ.. సాగుతున్న విష‌యాల‌ను ప్ర‌స్తావించాలి క‌దా..అంటున్నారు ప్ర‌జ‌లు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం స్థాపిస్తాన‌ని చెప్పి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన వైఎస్ త‌న‌య, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.. ష‌ర్మిల చేసిన విమ‌ర్శ‌ల‌పై ప్ర‌జ‌ల నుంచి ట్రోల్స్ వ‌స్తున్నాయి.

తాజాగా ష‌ర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అధికార పార్టీ టీఆర్ ఎస్ అప్పుల కుప్ప‌గా మార్చింద‌ని అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ‌గా మారుస్తాన‌ని చెప్పిన సీఎం కేసీఆర్‌.. అప్పుల తెలంగాణ‌గా మార్చి.. ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆమె విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్‌.. తెలంగాణ ప్ర‌జ‌ల‌పై రూ.4 ల‌క్ష‌ల కోట్ల అప్పులు రుద్దార‌ని దుయ్య‌బ‌ట్టారు. దొర‌గారి నియంత పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని అన్నారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌ని సీఎం కేసీఆర్‌.. త‌న కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నార‌ని.. ఎద్దేవా చేశారు. అయితే.. ష‌ర్మిల వ్యాఖ్య‌ల పై ప్ర‌జ‌ల నుంచే సూటి కామెంట్లు వినిపిస్తున్నాయి.

``నిజ‌మే. తెలంగాణ అప్పుల సంగ‌తి అలా ఉంచితే.. మీ అన్న జ‌గ‌న్ పాలిస్తున్న ఏపీ విష‌యం కూడా చెబితే బాగుంటుంది క‌దా !`` అని ఎక్కువ మంది నెటిజ‌న్లు వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు, ``ఏపీలో మాత్రం త‌క్కువ‌గా ఉందా? అక్క‌డ కేవ‌లం రెండున్న‌రేళ్ల కాలంలో 7 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశార‌నే విష‌యం.. కేంద్ర‌మే చెబుతున్న సంగ‌తి మ‌రిచిపోతే ఎట్ల‌క్కా?!`` అని నిల‌దీస్తున్నారు. గ‌డిచిన ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎంతో మంది సీఎంలు.. చేసిన అప్పుల‌తో పోల్చితే.. కేవ‌లం రెండున్న‌రేళ్ల‌లోనే ఈ అప్పులు చేయ‌డం తగ‌ద‌ని.. కేంద్ర‌మే మొత్తుకుంటున్న ప‌రిస్థితి నువ్వు గ‌మ‌నించ‌లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక‌, ఉద్యోగాల ముచ్చ‌ట కూడా ఏపీలో ఎలా ఉందో చూడ‌రాదే! అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ‌న్న రాజ్యం అక్క‌డ‌కూడా తెస్తానంటివి క‌దా.. ఎన్నిక‌ల ముంగ‌ట‌.. మ‌రి ఏం చేసిన‌వ్‌?! అని ప్ర‌శ్నిస్తున్నారు. వ‌లంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. చేతులు దులుపుకొనుడేనా? ఇంకే చేసేదేమైనా ఉందా? అని మీ అన్న‌ను నిల‌దీయారాదా అక్కా?! అని పెద‌వి విరుస్తున్నారు. ఏదైనా మాట్లాడే ముంగ‌ట‌.. మ‌న అన్నం ఏం చేస్త‌న్న‌డు.. కేసీఆర్ సార్ ఏం చేస్త‌న్న‌డు.. అనేది ఒక్క‌పాలి చూడ‌రాదే!! అంటూ.. స‌టైర్లు పేలుస్తున్నారు. ఏదేమైనా.. ష‌ర్మిల చేసిన విమ‌ర్శ‌ల‌కు ప్ర‌జ‌ల‌నుంచే ఇలా కౌంట‌ర్లు రావ‌డం రాజ‌కీయంగా చ‌ర్చకు దారితీస్తోంది. మ‌రి దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.