Begin typing your search above and press return to search.

బోర్డ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాలు నీవా-నావా... వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ..!

By:  Tupaki Desk   |   21 May 2023 11:04 AM GMT
బోర్డ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాలు నీవా-నావా... వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ..!
X
ఏపీకి బోర్డ‌ర్‌లో ఉన్న సుమారు 25 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి టీడీపీ, వైసీపీకి కొరుకుడు ప‌డ‌డం లేదు. ఈ సారి బోర్డ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పొరుగు రాష్ట్రాల‌కు చెందిన పార్టీల ప్ర‌భావం ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్నందున ఈ నియోజ‌క‌వ‌ర్గా లు కూడా అత్యంత కీల‌కంగా మారాయి. అయితే.. ఇటు క‌ర్ణాట‌క‌, అటు తెలంగాణ‌, మ‌రో వైపు త‌మిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది.

త‌మిళ‌నాడు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న చిత్తూరు జిల్లా, క‌ర్ణాట‌క ప్ర‌భావం ఉన్న అనంత‌పురం, తెలంగాణ ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాలు.. వైసీపీ, టీడీపీకి స‌వాలుగా మారాయి. తెలంగాణ ప్ర‌భా వం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ చొర‌వ, ఆశీస్సులు ఏ పార్టీకి ఎక్కువ‌గా ఉంటే..ఆ పార్టీ విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం మెండుగా ఉంటుంది. ఈ విష‌యంలో అందరికీ క్లారిటీ ఉంది.

అయితే.. ఇది తెలంగాణ‌లో ఈ ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటు న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు.. బీఆర్ఎస్ ఆశీస్సులు వైసీపీకి లోపాయికారీగా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు. మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వస్తే.. త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక‌, తెలంగాణ‌లోనూ పుంజుకోవాలని చంద్ర‌బాబు భావిస్తున్నారు. క‌నీసం ఈ సారి 10 - 15 స్థానాల్లో తెలంగాణ‌లో విజ‌యం సాధించే దిశ‌గా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇది.. బీఆర్ ఎస్‌కు కొరుకుడు ప‌డ‌డం లేదు. దీంతో వైసీపీ వైపు ఆ పార్టీ మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. వైసీపీ ఏపీ ప‌రిధి దాటి పొరుగు రాష్ట్రంలో పోటీ చేసే అవ‌కాశం లేదు. ఇది బీఆర్ ఎస్‌కు మేలు చేసే ప‌రిణామం. పైగా రెడ్డి వ‌ర్గం అంతా కూడా .. కేసీఆర్‌కు స‌పోర్టుగా ఉంది. ఇది కూడా వైసీపీకి క‌లిసి వ‌స్తోంది. ఇక‌, చిత్తూరు ప‌రిధిలో మాత్రం త‌మిళ‌నాడు రాజ‌కీయం అంతా .. టీడీపీకి అనుకూలంగా ఉంది. అనంత‌పురంలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. మొత్తంగా చూస్తే.. బోర్డ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు పార్టీలు మిశ్ర‌మంగా ఫ‌లితం క‌నిపిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.