Begin typing your search above and press return to search.
ఆ టీడీపీ ఎమ్మెల్యేను బుట్టలో ఎలా వేయాలో ఆలోచిస్తున్న వైసీపీ
By: Tupaki Desk | 1 Sept 2020 12:15 PM ISTప్రజల్లో ప్రజాదరణ ఉన్న నేతలను.. వరుసగా గెలుపు రుచి చూస్తున్న రేసు గుర్రాలను వైసీపీ వదలుకోవడానికి సిద్ధంగా లేదట.. అందుకే పగోడైనా సరే వైసీపీలో చేర్చుకునేందుకు ఉబలాటపడుతోందట.. మెరుగైన నేతలుంటే పార్టీ భవిష్యత్ బాగుటుందని యోచిస్తోందట..
విశాఖను ఏపీ పరిపాలన రాజధానిగా ప్రకటించిన వైసీపీ ఇప్పుడు ఆ నగరంపై పట్టు సాధించడానికి అడుగులు వేస్తోంది.ఈ క్రమంలోనే విశాఖలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందన్న చర్చ సాగుతోంది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే అయిన వెలగపూడి రామకృష్ణ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా గుర్తింపు పొందాడు. అందుకే హ్యాట్రిక్ కొట్టాడు. అతడి సామాజికవర్గం లేకున్నా.. బీసీలు పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గంలో రెండు సార్లు వైసీపీ బీసీలకు టికెట్ ఇస్తే.. అతడి చేతిలో ఓడిపోయారు అంటే ఒకసారి అతడి మాస్ ఫాలోయింగ్ ఎంతో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వెలగపూడి ఇప్పుడు నిత్యం ప్రజలతో ఉంటాడంట.. అయితే ఎందుకో అతడి మీద వైసీపీ కన్ను పడింది. అతడు ఏదో విధంగా నయానో భయానో చేర్చుకోవాలని.. లేదా మంచి ఇన్ చార్జిని తేవాలని అనుకుంటున్నారట.. అయితే టీడీపీ నుంచి వెలగపూడిని చేర్చుకోవడానికి ఆ నియోజకవర్గంలో వైసీపీ వాళ్లు ఒప్పుకోవడం లేదని టాక్.
వెలగపూడికి అడ్డుపుల్ల వేసేందుకు వైసీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయట.. ఎలా అయినా వెలగపూడి రామకృష్ణ చిట్టా త్వరలో తీయాలని వైసీపీ వర్గాలు అంటున్నాయి.అందుకే ముందు లిక్కర్ సిండికేట్.. రియల్ ఎస్టేట్ దందా ఇవన్నీ అక్కడ ఉన్న లీడర్స్ బయటకు తీయాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది...