Begin typing your search above and press return to search.

షాకిచ్చిన నలుగురు ఎమ్మెల్యేల మీద వైసీపీ వేటు

By:  Tupaki Desk   |   24 March 2023 6:07 PM GMT
షాకిచ్చిన నలుగురు ఎమ్మెల్యేల మీద వైసీపీ వేటు
X
వైసీపీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా వైసీపీ బాకులు దూసింది. వారి మీద సస్పెన్షన్ వేటు పడిపోయింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో విపక్ష టీడీపీ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ చేశారన్న కారణంతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఇది నిజంగా వైసీపీలోనే సంచలనం రేపే వ్యవహారం. జగన్ అలా చూసీ చూడనట్లుగా ఊరుకుంటారనే అంతా భావించారు. మూడున్నరేళ్ళుగా వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు రెబెల్ గా మారి రచ్చ చేస్తున్నా ఏనాడు సస్పెన్షన్ అన్నది ప్రయోగించలేదు

పైగా లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేసి ఆయన మీద అనర్హత వేటు పడేలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది అవన్నీ సక్సెస్ కాలేదు. ఈ లోగా పదవీ కాలం కాస్తా ముగుస్తోంది. అదే సీన్ ఎమ్మెల్యేల విషయంలో ఉంటుందని అంతా భావించారు. ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదేమీ ఉద్యోగం కాదు కదా చర్యలు తీసుకోవడానికి, సరైన సమయంలో చర్యలు ఉంటాయని చెప్పారు. ఆయన చెప్పి రోజు గడవలేదు ఇంతలో నలుగురు ఎమ్మెల్యేల మీద చర్యలకు అధినాయకత్వం దిగింది.

పార్టీ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించినందుకు కానీ ఈ చర్యలు పార్టీ క్రమశిక్షణా సంఘం తీసుకుంది అని సజ్జల తెలిపారు. ఇక ఎవరు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు అన్న దాని మీద పార్టీలో అంతర్గత అంతర్గత విచారణ చేశామని ఆయన తెలిపారు. దానికి అనుగుణంగానే ఈ చర్యలు అని ఆయన చెప్పరు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు పార్టీ గుర్తించిందని ఆయన చెప్పడం విశేషం .

అలా వైసీపీ పార్టీ గీతను దాటి క్రాస్ ఓటింగ్ చేసినవారిపై చర్యలు తీసుకుంది. ఆ నలుగురు శాసన సభ్యులను పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నామని ప్రక్టించారు. దర్యాప్తు చేసిన తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశాంఅని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు కానీ పార్టీలో ముసలం పుట్టింది.

ఆ విధంగా వైసీపీ తాను నిలబెట్టిన ఒక ఎమ్మెల్సీని కోల్పోవడం కాకుండా ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను దూరం చేసుకుంది. ఈ పరిణామంతో వైసీపీ బలం అసెంబ్లీలో 151 నుంచి 147కి పడిపోయినట్లు అయింది. మరి ఈ కధను ఇంతటితో వదిలేస్తారా లేక వారి మీద చర్యలకు స్పీకర్ కి ఫిర్యాదు చేసి సభ్యత్వాలు కూడా వారివి పోయేలా చూస్తారా అన్నదే ఇపుడు చూడాల్సిన అంశం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.