Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీల అత్య‌వ‌స‌ర స‌మావేశం?

By:  Tupaki Desk   |   1 Feb 2020 1:18 PM GMT
వైసీపీ ఎంపీల అత్య‌వ‌స‌ర స‌మావేశం?
X
కేంద్ర బ‌డ్జెట్-2020 పై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అన్ని రంగాల‌కు న్యాయం చేశాన‌మ‌ని, అన్ని రాష్ట్రాల‌కు స‌మతూకంగా ఉండేలా బ‌డ్జెట్ రూపొందించామ‌నిఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. అయితే, బ‌డ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపార‌ని వైసీపీ ఎంపీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏపీ లోని వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవ‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్‌ కూడా ఇవ్వలేద‌ని, ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావించలేదని విజ‌య‌సాయి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యం లోనే వైసీపీ ఎంపీలంతా క‌లిసి అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

కేంద్ర బడ్జెట్‌ లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించ‌డం పై వైసీపీ ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్‌లో ఏపీకి జ‌రిగిన అన్యాయం, నిధులు కేటాయించ‌క‌ పోవ‌డంపై చ‌ర్చించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అయితే, ఈ స‌మావేశం నిర్వ‌హించేందుకు సీఎం జ‌గ‌న్ అనుమ‌తి కోరిన‌ట్లు తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించిన త‌ర్వాత వైసీపీ ఎంపీలు ఒక నిర్ణ‌యానికి వచ్చే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్ సూచ‌న‌ల‌ను బ‌ట్టి కేంద్ర ప్ర‌భుత్వం పై త‌మ వైఖ‌రిని స్ప‌ష్టం చేయాల‌ని వైసీపీ ఎంపీలు భావిస్తున్నార‌ట‌. కేంద్ర ప్ర‌భుత్వంతో సంబంధాల విష‌యంలో య‌థాత‌ధ స్థితిని కొన‌సాగించాలా....లేక బ‌డ్జెట్‌ లో ఏపీకి మొండిచేయి నేప‌థ్యంలో కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న తెల‌పాలా అన్న‌దాని పై ఈ స‌మావేశం అనంత‌రం స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.