Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎంపీల జేబుల్లో ఆ లెట‌ర్స్

By:  Tupaki Desk   |   27 March 2018 5:12 AM GMT
జ‌గ‌న్ ఎంపీల జేబుల్లో ఆ లెట‌ర్స్
X
ఈ రోజు నుంచి ఏ క్ష‌ణంలో అయినా బ్రేకింగ్ న్యూస్ కింద టీవీ ఛాన‌ళ్ల‌లో బ్రేక్ అయ్యే అవ‌కాశం ఉన్న విష‌యంగా దీన్ని చెప్పాలి. ప్ర‌త్యేక హోదా అంశంపై గ‌డిచిన నాలుగేళ్లుగా వివిధ రూపాల్లో త‌మ నిర‌స‌ను తెలియ‌జేస్తున్న ఏపీ విప‌క్షం ఇప్పుడు సీరియ‌స్ నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఈ రోజు నుంచి ఏ క్ష‌ణంలో అయినా.. త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేందుకు జ‌గ‌న్ ఎంపీలంతా సిద్ధ‌మైపోయారు.

దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఒక మాట అనేసుకున్న‌ట్లు తెలుస్తోంది. వివిధ రూపాల్లో సుదీర్ఘంగా నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు నిర్వ‌హించిన నేప‌థ్యంలో.. హోదాపై తాడోపేడో తేల్చేసుకునేందుకు జ‌గ‌న్ పార్టీ సిద్ధ‌మైపోతోంది. ఇంకెలాంటి ఆల‌స్యం చేసుకోకుండా.. లోక్ స‌భ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన మ‌రుక్ష‌ణం హోదాపై త‌మ రాజీనామాల్ని స్పీక‌ర్ కు అంద‌జేయాల‌ని నిర్ణ‌యించారు.

హోదా విష‌యంలో ఇప్ప‌టికే ప‌లుమార్లు మాట మార్చిన ఏపీ స‌ర్కారు.. ఇటీవ‌ల కాలంలో హోదాపై చేస్తున్న హ‌డావుడి తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ప్యాకేజీ రాగం తీసిన తెలుగు త‌మ్ముళ్లు ఇప్పుడు హోదా త‌ప్ప మ‌రేమీ వ‌ద్దంటున్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో హోదా సాధ‌న విష‌యంలో జ‌గ‌న్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ‌కు హోదా సాధ‌న త‌ప్పించి మ‌రేదీ ముఖ్యం కాద‌ని.. దాని కోసం అవ‌స‌ర‌మైతే త‌మ ఎంపీ ప‌ద‌వుల్ని త్యాగం చేసేందుకు సైతం సిద్ధ‌మ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

హోదా సాధ‌న కోసం అవిశ్వాస తీర్మానం తీసుకురావ‌టం ద్వారా.. ఏపీలోని అన్ని రాజ‌కీయ ప‌క్షాలు హోదా విష‌యం మీద మాట్లాడేలా చేసిన జ‌గ‌న్ పార్టీ.. తాజాగా త‌మ రాజీనామాల‌తో ఏపీలో పొలిటిక‌ల్ హీట్ జ‌న‌రేట్ చేయ‌ట‌మే కాదు.. కేంద్రంపైనా ఒత్తిడిని మ‌రింత పెంచేందుకు రెఢీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో రాజీనామా లేఖ‌ల్ని జ‌గ‌న్ ఎంపీలు జేబుల్లో పెట్టుకొని తిర‌గ‌నున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.