Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఏపీలో ఇద్దరు ఎంపీలకు కరోనా

By:  Tupaki Desk   |   14 Sept 2020 11:15 AM IST
బ్రేకింగ్: ఏపీలో ఇద్దరు ఎంపీలకు కరోనా
X
ఏపీలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. ఆదివారం కూడా అదే జోరు కొనసాగింది.

తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 9536 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72233 టెస్టులు చేయగా దాదాపు 10వేల కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,67,123కు పెరిగాయి.

ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 66 గా నమోదైంది.

ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీకి పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

ఇక మరో ఎంపీ కూడా కరోనా బారినపడ్డారు. అరకు ఎంపీ మాధవికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ.. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. దీంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే ఆమె చికిత్స తీసుకోనున్నారు.

కాగా నిన్న కాకినాడ ఎంపీ వంగ గీత ఇదివరకే వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలోనే పకడ్బందీ చర్యలతో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 24మంది ఎంపీలు, 8మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా ఉన్నవారిని సభలోకి అనుమతించడం లేదు.