Begin typing your search above and press return to search.
జగన్ గుడ్డిగా నమ్ముతారు...కుప్పంలో జరిగింది అదే... ?
By: Tupaki Desk | 26 Dec 2021 1:13 PM ISTజగన్ వ్యక్తిగత విషయాలు జనాలకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆయన మీడియాను ఎపుడూ ఫేస్ చేయరు. అలాగే జగన్ ఏ బహిరంగ వేదికనూ పెద్దగా పంచుకోరు. ఆయన విపక్ష నేతగా ఉన్నపుడు జనాల్లో ఉన్నారు, ఇక సీఎం అయ్యాక అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎపుడైనా బహిరంగ సభల్లో ప్రభుత్వ పక్షానే మాట్లాడుతారు. అయితే ఆయన గురించి యాంటి మీడియాలో వచ్చిన ప్రచారం తప్ప ఆయన ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, ఆయన ఇలా అని తెలిసింది జనాలకు బహు తక్కువ.
అయితే ఆయనకు కుడి భుజం లాంటి నేత, చిత్తూరు జిల్లాకు చెందిన స్ట్రాంగ్ లీడర్, రాజంపేట వైసీపీ ఎంపీ అయిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి భాషలో చెప్పాలంటే జగన్ ఎవరైనా నమ్మారంటే మాత్రం గుడ్డిగా నమ్మేస్తారు. ఇలామిధున్ రెడ్డి జగన్ లోకి ఎవరికీ తెలియని కోణాన్ని ఆవిష్కరించారు. జగన్ ఎవరినైనా నమ్మితే సగం సగం మాత్రమే నమ్మరు, ఆయన మనసు పెట్టి పూర్తిగా నమ్మేస్తారు అంటూ గుడ్డిగా నమ్మడమే జగన్ కి తెలుసు అని మిధున్ రెడ్డి మాట్లాడారు.
అలా తనను జగన్ బాగా నమ్మారని, అందుకే చిత్తూరు జిల్లాలో వైసీపీని స్ట్రాంగ్ గా చేయడంతో తాను ఉన్నానని చెప్పారు. జగన్ తమ ఫ్యామిలీ మీద చూపిన ప్రేమాభిమానాలు, పెట్టిన నమ్మకానికి తాము ప్రతీ ఎన్నికల్లో గెలుపుని బహుమానంగా ఇస్తున్నామని మిధున్ రెడ్డి చెప్పారు. తాను జగన్ కి కుడి భుజమా ఎడమ భుజమా అనేదాని కంటే కూడా వైసీపీకి జగన్ కి డ్రై హార్డ్ ఫ్యాన్ అంటే సరిపోతుందని మిధున్ రెడ్డి చెప్పారు.
ఇక కుప్పంలో తాము చంద్రబాబుని టార్గెట్ చేసామనడం సరికాదని ఆయన అన్నారు. కుప్పంలో బాబు పట్ల జనంలో వ్యతిరేకత వచ్చిందని, ఆయన అక్కడ అనేక సార్లు గెలిచి కూడా పట్టించుకోలేదని, దాంతో వారే ఆయన్ని ఓడించారని మిధున్ రెడ్డి చెప్పారు. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 30 వేల మెజారిటీ వస్తే అందులో కుప్పం మునిసిపాలిటీ మెజారిటీ పదివేలు ఉందని, తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుంటే వైసీపీకి అక్కడ మూడు వేల మెజారిటీ వచ్చిందని మిధున్ రెడ్డి చెప్పారు. దీని బట్టి చూస్తే బాబు పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చునని అన్నారు.
ప్రజలలో మార్పు రాకపోతే చంద్రబాబు పులివెందుల వెళ్లి మీటింగ్ పెట్టినా అక్కడ టీడీపీ గెలుపు సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. తాము చేసే పనుల బట్టే జనాలు ఓటు వేస్తారని, వైసీపీ పాలనను చూసే కుప్పం ఓటర్ తమ పార్టీ వైపు టర్న్ అయ్యారని, అంతే తప్ప బాబుని టార్గెట్ చేయడం అన్నది సరికాదు అని మిధున్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక తాను చిత్తూరు జిల్లా మొత్తాన్ని గుప్పిట పట్టానని అనడం తప్పు అని ఆయన అన్నారు.
పార్టీ కోసం పనిచేస్తున్నామని, ప్రభుత్వంలో ఉన్నామని, అందువల్ల అనేక విషయాల్లో తాము ముందుంటామని, దాన్ని చూసి అదేదో జిల్లాను టోటల్ గా గుప్పిట పట్టారని అనడం ప్రత్యర్ధుల విమర్శ తప్ప మరేమీ కాదని అన్నారు. ఇక తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని పక్కన పెట్టి తానే అసలైన మంత్రిగా అధికారం చలాయిస్తున్నాను అంటూ వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను ఒక ఎంపీనని, పైగా లోక్ సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ ని అని తన ప్రోటోకాల్ తనకు ఉంటుందని ఆయన వివరించారు.
చిత్తూరు జిల్లా నుంచి ఈ తడవ రోజాకు మంత్రి పదవి వస్తే సంతోషించే వారిలో తానే ముందు ఉంటానని చెప్పారు. రోజా తమ బంధువు, తమ ఫ్యామిలీ మెంబర్ అని కూడా మిధున్ రెడ్డి చెప్పడం విశేషం. మొత్తానికి మిధున్ రెడ్డి ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలే చెప్పారు.